Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CSEAP Meeting Updates on Transfers and Rationalization

CSEAP Meeting Updates on Transfers and Rationalization.
CSEAP Meeting Updates on Transfers and Rationalization

ఉపాధ్యాయ సంఘాలతో కమీషనర్ గారి సమావేశం వివరాలు....



  • రేషనలైజేషన్‌తో టీచర్‌ పోస్టులు రద్దు కావు
  • సర్వీసు పాయింట్లు ఏడాదికి 0.25
  • ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 20
  • 280పైబడిన హైస్కూళ్లకు రెండో బీఎస్‌, పీఎస్‌
  • సర్వీసు, స్టేషన్‌ పాయింట్ల ఆధారంగా బదిలీలు
  • 60 మంది విద్యార్థులుంటే మూడో టీచర్‌ పోస్టు
  • సాధ్యంకానిపక్షంలో విద్యా వలంటీర్‌ నియామకం
  • ఎనిమిదేళ్లు ఒకోచోట ఉంటే బదిలీ తప్పనిసరి
  • ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ సమావేశం
  • ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌పై ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టులలో ఒక్కటి కూడా రద్దు కాకుండా రేషనలైజేషన్‌ను చేపడతామని తెలిపింది.

  • విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని 1 : 20గా కొనసాగించేందుకు అంగీకరించింది. ఈ రేషియో ప్రకారం 40 మంది విద్యార్థుల ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు టీచర్లను, 60 మంది ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను ఉంచేందుకు ప్రభుత్వం సూత్రబద్దంగా అంగీకరించింది.*
  • 40 మంది విద్యార్థులు మించిన చోట మూడో ఉపాధ్యాయ పోస్టును ఇవ్వలేనిపక్షంలో విద్యా వలంటీర్‌ను నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
  • ఉపాధ్యాయ సర్వీసు పాయింట్లను 50 శాతం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సర్వీసు పాయింట్లు 0.50గా ఉంటే, దానిని 0.25కు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
  • ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషస్‌ ప్రక్రియపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలోని రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయం ఆవరణలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్‌, కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు బుధవారం సమావేశమయ్యారు.
  • రేషనలైజేషన్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఏ అంశంపైనా వారు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.
  • ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1 : 30గా చేయడం వల్ల పోస్టులు రద్దయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉన్నట్టే 1 : 20 విధానాన్ని కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ తెలిపారు.
  • ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులుంటే మూడో పోస్టు ఇస్తామని, అది సాధ్యంకాని పక్షంలో వలంటీరును నియమించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
  • ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఉపాధ్యాయ పోస్టులను కొనసాగించాలని, అవి ఖాళీ అయితే, ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పించాలని పలు సంఘాల నాయకులు సూచించారు.
  • హైస్కూల్స్‌లో సబ్జెక్ట్‌ టీచర్స్‌ లేనిచోట యూపీ స్కూళ్ల నుంచి టీచర్లను పంపించేందుకు వారు ఆమోదం తెలిపారు. 280పైబడిన విద్యార్థులున్న హైస్కూళ్లకు బీఎస్‌ (ఎన్‌ఎస్‌), పీఎస్‌ రెండో పోస్టును మంజూరు చేసేందుకు అంగీకరించారు.
  • డీఈఓ పూల్స్‌లో ఉన్న భాషా పండిట్‌లను యూపీ స్కూళ్లలో నియమించి, అక్కడి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అప్‌గ్రేడెడ్‌ హైస్కూళ్లకు హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
  • రేషనలైజేషన్‌ వల్ల ఏ ఒక్క పోస్టు కూడా రద్దు కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం బదిలీలపైనా సంఘాలతో కార్యదర్శి, కమిషనర్‌ చర్చించారు. సర్వీసు, స్టేషన్‌ ఆధారంగానే బదిలీలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
  • బదిలీల నిర్వహణకు కటాఫ్‌ తేదీ జూలై 31గా నిర్ణయించాలని సంఘాలు సూచించారు. అలాగే గతంలో మాదిరిగానే సర్వీస్‌ స్టేషన్‌ కనీసం రెండేళ్లు, గరిష్టం ఎనిమిదేళ్లగా అమలు చేయాలని కోరగా, అందుకు అధికారులు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు.
  • తాజా నిర్ణయం ప్రకారం 2012 నవంబరు 18 కంటే ఒక స్కూల్‌లో చేరిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకావల్సి ఉంది.
  • టీచర్ల సర్వీసు పాయింట్లను 1 చేయాలని సంఘాలు కోరుతుంటే, అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న 0.50ను 0.25కు కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉందని పలువురు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.
  • కేటగిరి -1కు ఒక పాయింట్‌, కేటగిరి-2కు రెండు, కేటగిరి-3కి మూడు, కేటగిరి -4కు ఐదు పాయింట్లను, స్పౌజ్‌కు ఐదు పాయింట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.
  • ఇక హెచ్‌ఆర్‌ఏ విషయంలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంఘాల నాయకులను విస్మయానికి గురి చేసింది. ఎనిమిది కిలోమీటర్లు దాటి స్కూల్‌కు వెళ్లే ఉపాధ్యాయుల హెచ్‌ఆర్‌ఏను పూర్తిగా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. టీచర్లంతా ఎనిమిది కిలోమీటర్లలోపే నివాసం ఉండాలని వారు స్పష్టం చేశారు.
  • ఇదిలావుండగా, సమావేశంలో ఒక కొత్త అంశాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రస్తావించారు.
  • ఎల్‌కేజీ, యూకేజీ నుంచి మూడో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు, నాలుగు నుంచి పదో తరగతి వరకు హైస్కూళ్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

  • 7 తర్వాత వారానికి ఒక్క రోజే

  • ఈ నెల ఏడో తేదీ తర్వాత నుంచి ఉపాధ్యాయులు వారానికి ఒక్క రోజే పాఠశాలకు రావాలని పాఠశాల విద్య కమిషనర్‌ చినవీరభద్రుడు తెలిపారు.
  • కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతున్నందున్న ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు.
  • హైస్కూల్‌ ఉపాధ్యాయులు మాత్రం వారంలో రెండుసార్లు స్కూల్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
  • ఏడో తేదీ తర్వాత నుంచి బయోమెట్రిక్‌ హాజరు నుంచి కూడా మినహాయింపు ఇస్తామన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఉన్న ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పూర్తిగా మినహాయింపు ఇస్తామన్నారు.
  • అయితే, స్కూళ్లను ఎపుడు ఓపెన్‌ చేస్తారో ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇదిలావుండగా, ఏడో తేదీలోగా యూడైస్‌ వర్క్‌ను పూర్తి చేయాలని సూచించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CSEAP Meeting Updates on Transfers and Rationalization"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0