Academic Calendar
అకడమిక్ క్యాలెండర్
- కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ తరగతులతోనే ప్రారంభం కానుంది.
- సాధారణ పరిస్థితి వచ్చేవరకు కొంతకాలం ఆన్లైన్ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తోంది.
- ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు.
- పాఠ్యాంశాలను 30శాతం తగ్గిస్తారు.
- పండగ సెలవులు తగ్గింపు.
- సంక్రాంతి, దసరా సెలవులను తగ్గిస్తారు. మొత్తం పని దినాలు 180.
- పాఠశాలలు పని చేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఆన్లైన్, దూరదర్శన్, మనటీవీ ద్వారా పాఠాల ప్రసారం. కరోనా ప్రభావం తగ్గాక నేరుగా తరగతులు.
- ఇప్పటికే ఆరు గంటలపాటు సప్తగిరి ఛానల్ ద్వారా 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-10 విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. దీన్ని కొనసాగిస్తారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు.
- మార్చిలో నిర్వహించే పరీక్షలను ఏప్రిల్‌కు మార్పు చేయడం, మే నెల మొదటి వారంలో 6-9 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్‌కు రూపకల్పన చేస్తున్నారు.
- మే రెండోవారం నుంచి 12 జూన్-2021 వరకు సెలవులు ఇచ్చి, తర్వాత ఎలాంటి మార్పుల్లేకుండా వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారని సమాచారం.
10th exams date
ReplyDelete