Digital salute Independence celebrations on webcasting
డిజిటల్ వందనం
స్వాతంత్య్ర వేడుకలు వెబ్ క్యాస్టింగ్‌లో
స్వాతంత్య్ర వేడుకలు వెబ్ క్యాస్టింగ్‌లో
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర సంబరాలను ఏటా వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుంటారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జనం ఒకచోట చేరడం శ్రేయస్కరం కాదు కాబట్టి చాలామంది ఈ ఏడాది వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు. దీంతో సంబరాలను ఎక్కువమంది చూసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయించింది.దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ దఫా స్వాతంత్య్ర వేడుకలకు డిజిటల్ హంగులు అద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడంతోపాటు అక్కడ నిర్వహించే కవాతు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలను వెబ్ క్యాస్టింగ్ విధానంలో ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక సంఖ్యలో జనం ఒకచోట గుమిగూడటం శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ మేరకు చర్యలు చేపట్టింది. స్వాతంత్య్ర సంబరాలను ఎక్కువమంది చూసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయాలని నిర్ణయించింది. వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాల్లో పోలీసులు, మిలటరీ బ్యాండ్‌లతో ప్రదర్శనలు నిర్వహించి రికార్డు చేయాలని, అనంతరం వాటిని పెద్ద తెరలు, డిజిటల్-సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయాలని లేఖలో కేంద్ర హోం శాఖ సూచించింది. వేడుకలు నిర్వహించే స్థలాల్లో జనం అధిక సంఖ్యలో గుమిగూడకుండా చూడాలని దిశా నిర్దేశం చేసింది. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు స్వాతంత్య్ర దినోత్సవ ప్రదర్శనల్లో కనిపించాలని సూచించింది. డిజిటల్-సోషల్ మీడియా వేదికల్లో దేశ భక్తి సందేశాలను విస్తృతంగా ప్రచారం చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.
0 Response to "Digital salute Independence celebrations on webcasting"
Post a Comment