Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vegetarianism is the best for health

శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమం
Vegetarianism is the best for health

ప్రపంచంలో దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు లాంటివాటిలో ఎవరి శైలి వారిదే. అందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాలం గడిచే కొద్దీ వీటిల్లోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చారు. ఆహారం విషయంలోనూ అలాగే జరిగింది. ఒకప్పుడు మాంసాహారంపై ఆధారపడిన మనిషి వ్యవసాయం నేర్చుకొని శాకాహారంపై దృష్టిసారించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా శాకాహారానికి డిమాండ్గ పెరిగిపోతోంది. పలువురు వైద్యనిపుణులు సైతం శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమమని సూచిస్తున్నారు. పెటా లాంటి సంస్థలు శాకాహారంపై ప్రచారాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు.


మహాత్మాగాంధీ, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌, అమితాబ్‌ బచన్‌, రుక్మిణిదేవి అరుండాళ్‌, మోరార్జీ దేశాయి, అనిల్‌ కుంబ్లే, షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌, మల్లయోధుడు సుశీల్‌కుమార్‌, ఆర్‌ మాధవన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సచిన్‌ టెండూల్కర్‌....వీరందరి మధ్య కూడా ఓ సామ్యం ఉంది. వారంతా శాకాహారులే!


ఎన్నెన్నో కారణాలు

ప్రజానీకం శాకాహారాన్ని ఇష్టపడేందుకు ఎన్నో కారణాలున్నాయి. జీవహింస ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మతపరమైన విశ్వాసాలు, జంతువుల హక్కులను గౌరవించడం, ఆరోగ్యం, రాజకీయపరమైన కారణాలు, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఇందులో ముఖ్యమైనవి.

వీటికి కూడా దూరం

ఎంతో మంది శాకాహారులు ప్యాకేజ్డ్‌ లేదా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉంటారు. వీరు కేక్‌లు, కుకీలు, చాక్‌లెట్స్‌, పుట్టగొడుగులతో తయారైనవి లాంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. వాటి షెల్ఫ్‌లైఫ్‌ పెంచే ప్రక్రియలో, తయారీ ప్రక్రియలో జంతుసంబంధాలను ఉపయోగించి ఉంటారేమోనన్న భయం ఇందుకు కారణం. చీజ్‌ లాంటి వాటి తయారీలో చాలా దేశాల్లో జంతు సంబంధాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఆ విషయం తెలియని వారు వాటిని ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. ఒరిస్సాలో శాకాహారులు సైతం జలపుష్పాల (చేపలు)ను ఆహారంగా స్వీకరిస్తుంటారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు

అమెరికా ప్రభుత్వ విభాగాలు విడుదల చేసిన డయటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ అమెరికన్స్‌ (2010) నివేదిక ప్రకారం మాంసాహారుల కంటే కూడా శాకాహారులే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. శాకాహారుల్లో స్థూలకాయం తక్కువ. గుండెవ్యాధులు కలిగే అవకాశాలు కూడా తక్కువే. శాకాహారం బీపీని పెంచకుండా చూస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ కూడా తక్కువే.

ఎన్నో రకాలు

నిజానికి శాకాహారంలోనూ మరెన్నో ఉపతెగలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే...


ఓవో వెజిటేరియనిజం: వీరు గుడ్లు తింటారు కానీ పాలు తాగరు. పాల ఉత్పాదనలు తినరు. ఇందులో కొందరు నాటుకోడిగుడ్లు తినరు. కేవలం ఫామ్‌ గుడ్లు (ఫలదీకరణ ప్రక్రియ ఉండనివి) మాత్రమే తింటారు.లాక్టో వెజిటేరియనిజం:వీరు పాలు, పాల ఉత్పాదనలు స్వీకరించినా, గుడ్డుకు మాత్రం దూరంగా ఉంటారు.ఓవో-లోక్టో వెజిటేరియనిజం: వీరు, పాలు, గుడ్లు కూడా స్వీకరిస్తారు.

ప్యూర్‌ వెజ్‌: పాలు, తేనె, గుడ్లు తినరు. జంతువులపై పరీక్షించిన ఉత్పాదనలను వాడరు. జంతువుల చర్మం తదితరాలతో తయారైన దుస్తులు, పాదరక్షలు, అలంకరణ వస్తువులు తదితరాలను ఉపయోగించరు.


రా వెజ్‌: తాజా పండ్లు, విత్తనాలు, కూరగాయలు మాత్రమే స్వీకరిస్తారు. మరీ అవసరమైతే తప్ప వాటిని ఉడికించేందుకు కూడా ఇష్టపడరు.ఫ్రూటరియానిజమ్‌: వీరు పండ్లు, విత్తనాలు, చెట్లకు హాని కలిగించకుండా సేకరించే వాటిని మాత్రమే తింటారు.బుద్దిస్ట్‌వెజిటేరియనిజం: శాకాహారంలోనూ ఉల్లిగడ్డ, అల్లం లాంటి వాటికి దూరంగా ఉంటారు.జైన్‌వెజిటేరియనిజం: పాలు ఆహారంగా తీసుకున్నప్పటికీ గుడ్లు, తేనె, దుంపలకు దూరంగా ఉంటారు.శాకాహారమే ఎందుకు తినాలి?

కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చదవండి.
డీటాక్సిఫై:వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.
ధృడమైన ఎముకలు:మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.


కార్బోహైడ్రేట్స్ లోపం: నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఆరోగ్యకరమైన చర్మం: బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.బరువు నియంత్రణ: కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.ఫైటో న్యూట్రియెంట్స్: డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.

సులభంగా నమలడం:మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.


శాకాహారంతోలోటేమిటి?
 శాకాహారంలో లభించే పోషకాలు.....

శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vegetarianism is the best for health"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0