Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education Commissioner Chinaveerabhadra witnessed the teacher transfers in August.

ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు సాక్షి'తో విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు గారు.
Education Commissioner Chinaveerabhadra witnessed the teacher transfers in August.

శ్రీకాకుళం : ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారం లోగా పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ చినవీర భద్రుడు తెలిపారు . దీనిపై విధివిధానాలను ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు . నాడు - నేడు పనుల పరిశీలనకు మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన ' సాక్షి'తో మాట్లాడారు . సెప్టెంబర్ 5 న పాఠశాలలు తెరిచే లోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు . న్యాయపర మైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియమ నిబం ధనలను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు 
అవసరమైతే కొత్త సర్వీసు నిబంధనలు 
రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ విష యంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని , అది కుదరని పక్షంలో కొత్త నిబంధనలను రూపొంది స్తామని కమిషనర్ చెప్పారు . ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలో ప్రభుత్వ , పంచాయతీరాజ్ ఉపాధ్యాయు లతో సమావేశమై ఇరుపక్షాలు రాజీ ధోరణి అవలంబించి ఒక ఒప్పందానికి రావాలని సూచించామన్నారు . రాష్ట్రం లోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు . జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తే పోస్టుల మంజూ రుతో సహా చేస్తామని పేర్కొన్నారు . వీటిని పదోన్నతుల ద్వారా , నేరుగా భర్తీలా , కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ విధా నంలో భర్తీ చేయాలా అన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు . 
పాఠశాలలకు పండుగ కళ .. 
ప్రభుత్వ పాఠశాలలకు పండుగ కళ తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు . 34 ఏళ్ల తన సర్వీసులో ప్రభుత్వ పాఠశాలలపై ఇంతటి దృష్టిని సారించిన ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు . శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు గ్రానైట్ ఫ్లోరింగ్ చేయించాలని కలెక్టర్ నివాస్ నిర్ణయం తీసుకో వడం అభినందనీయమన్నారు . ఆయనతో పాటు డీఈఓ చంద్రకళ , డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుమల చైతన్య , సమ గ్రశిక్షా అభియాన్ ఏపీసీ పైడి వెంకటరమణ , ఎస్సీ కార్పొ రేషన్ ఈఈ భాస్కరరావు , శ్రీకాకుళం ఉప విద్యాశాఖా ధికారి పగడాలమ్మ తదితరులు ఉన్నారు ..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education Commissioner Chinaveerabhadra witnessed the teacher transfers in August."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0