What should be done to keep the heart healthy ..?
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
శరీరంలో ప్రతీ అవవయమూ కీలకమే. ఏది సరిగ్గా పనిచేయకపోయినా, ఆ ప్రభావం మొత్తం శరీరంపై చూపిస్తుంది. అయితే, ఈ అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలంటే మాత్రం తప్పనిసరిగా పనిచేయాల్సింది గుండె. మనం నిద్రపోతున్నా సరే గుండె మాత్రం నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. మన బాడీలో ప్రతీ పార్ట్ కు రెస్ట్ దొరుకుతుంది, ఒక్క గుండెకు తప్ప. అన్ని శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ, నిరంతరం అలుపు లేకుండా పనిచేసే హృదయం ఇంకెంత ఆరోగ్యంగా ఉండాలో, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
మనం తినే ఆహారమే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మితంగా మంచి ఆహారాన్ని, తీసుకుంటే మంచి జీవితం. కొలెస్ట్రాల్, కొవ్వు, నూనె పదార్ధాలు తింటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అందువల్ల మంచి జీవనశైలి, అలవాట్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా అధికమొత్తంలో విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ల లోపం వలనే మెజారిటీ గుండెవ్యాధులు సంక్రమిస్తాయి.
విటమిన్ సి అనేది అవయవాల పెరుగుదలకు, అభివృద్ధికి విటమిన్ సి తప్పనిసరి. ధమనుల్లో కలిగే ప్రమాదాలను విటమిన్ సి నివారిస్తుంది. ఈ విటమిన్ తక్కువగా తీసుకునేవారికి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, గుండెపోట్లు కలిగే అవకాశం ఉంది. నారింజపండ్లు, స్ట్రాబెర్రీ, పుచ్చపండు, బ్రోకలీ, బ్రసెల్, టామోటాలు, క్యాబేజీ వంటి వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.
గుండెవ్యాధుల్ని అధికం చేసే హైబీపీ, ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్య పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు విటమిన్ డి అత్యవసరం. హృదయంతో పాటు, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేయడంలో, ఎముకలు, దంతాల్ని మరింత ధృఢంగా మార్చడంలో విటమిన్ డి చాలా కీలకపాత్ర పోషిస్తుంది.
విటమిన్ 'B౩'
విటమిన్ 'B౩' (నియాసిన్) గుండెవ్యాధుల్ని తగ్గిస్తుంది. చెడు కొవ్వు పదార్ధాల స్థాయిల్ని తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. విటమిన్ బి12 శరీరంలోని అమైనో యాసిడ్ స్థాయిల్ని తగ్గిస్తుంది. అమైనో యాసిడ్ స్థాయి పెరిగే కొద్దీ గుండెవ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చేప, పాల ఉత్పత్తుల్లో బి 12 విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాక, అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న పదార్ధాలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఫాటీ మీట్స్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువ తీసుకోవాలి. ఫ్రై లు, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే గుండెకు మంచిది. బీపీ సమానంగా మెయింటెయిన్ అయితేనే గుండె పనితీరు బాగుంటుంది. అందుకు సోడియం అవసరం. సోడియం ఉప్పులో అధికమోతాదులో లభిస్తుంది. కాబట్టి, ఆహారంలో ఉప్పును తగినంత ఉండేలా
చూసుకోవడం కూడా చాలా ముఖ్యం . మనిషి పదికాలాలు చల్లగా బ్రతకాలంటే , ముందుగా హృదయాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి
Super jagannana
ReplyDelete