Some tips for implementing an alternative academic calendar.
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ని implement చేయడానికి కొన్ని సూచనలు.
- Step 1.ముందుగా పాఠశాల లో మీరు deal చేస్తున్న తరగతులలో ని విద్యార్థుల ఫోన్ నంబర్స్ సేకరించుకోవ డం
- 2.వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
- 3. parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
- 4.learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ni తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా ఇవ్వాలి.
- 5.ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
- 6.ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
- 7. దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
- 8.కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు ప్రాధాన్యత ఇవ్వాలి.
- 9.పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
- 10.సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
- 11.teacher workdone statement లో మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.
0 Response to "Some tips for implementing an alternative academic calendar."
Post a Comment