Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Survey: Telugu people who send their children to schools until the vaccine arrives ... Here are the survey results

Survey :వ్యాక్సిన్ వచ్చేవరకు పిల్లల్ని స్కూళ్లకు పంపమన్న తెలుగు ప్రజలు ... సర్వే రిజల్ట్స్ ఇవే.
survey: Telugu people who send their children to schools until the vaccine arrives ... Here are the survey results

News18 Public Sentimeter survey | కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం స్కూళ్లపైనా ఉంది . వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూళ్లకు పంపమని , ఆన్లైన్లో క్లాసులు చెప్పేటట్లైతే ఫీజులు తగ్గించాలని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు . నెట్వర్క్ 18 జరిపిన సర్వేలో తెలుగు ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వ్యాక్సిన్ రిలీజ్ అయ్యే వరకు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేది లేదని తెలుగు ప్రజలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆన్‌లైన్ క్లాసులు, ఫీజుల వసూళ్ల పైనా వ్యతిరేకత కనిపించింది. అసలు స్కూళ్లు ఇప్పుడు తెరవాలా? వద్దా? ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలా? ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే తల్లిదండ్రులు మొత్తం ఫీజులు చెల్లించాలా? ఫీజులు తగ్గించాలని స్కూళ్లను కోరతారా? ఇలాంటి 7 ప్రశ్నలతో నెట్వర్క్18 సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి ఏ ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ అయ్యారో తెలుసుకుందాం.


  • 1. స్కూళ్లు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నట్టైతే పూర్తి ఫీజు వసూలు చేయాలా?
  • ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే పూర్తి ఫీజు వసూలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రశ్నకు అవును అని 5.36% శాతం మంది సమాధానం ఇవ్వగా కాదు అని 88.56% శాతం మంది బదులిచ్చారు. తెలియదు / చెప్పలేం అని 6.08% మంది అభిప్రాయపడ్డారు.
  • 2. స్కూళ్లు ఫీజులు తగ్గించేందుకు అంగీకరిస్తే ఎంత శాతం తగ్గించాలని మీరనుకుంటున్నారు?
  • స్కూళ్ల యాజమాన్యాలు 50 శాతం కన్నా ఎక్కువ ఫీజులు తగ్గించాలని మెజార్టీ ప్రజలు అభిప్రాయ పడ్డారు. ఫీజులు 10-20% మధ్య తగ్గించాలని 5.09% మంది, 20-40% మధ్య తగ్గించాలని 21.24% మంది, 50% లేదా అంతకన్నా ఎక్కువ తగ్గించాలని 37.80% మంది, స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని 35.87% మంది అభిప్రాయపడ్డారు.
  • 3. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యాబోధన సమర్థవంతంగా ఉంటుందని మీరనుకుంటున్నారా?
  • ఆన్‌లైన్‌లో విద్యాబోధన సమర్థవంతంగా ఉండదన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపించింది. ఆన్‌లైన్‌లో విద్యాబోధన సమర్థవంతంగా ఉండదని 69.66% మంది చెబితే, బాగుంటుందని 18.56% మంది అన్నారు. తెలియదు / చెప్పలేం అని 11.79% మంది అభిప్రాయపడ్డారు.
  • 4. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు టీచర్లు సుశిక్షితులై ఉన్నారని మీరనుకుంటున్నారా?
  • ప్రస్తుతం ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్న టీచర్స్ సుశిక్షితులు కారని అభిప్రాయపడ్డారు తెలుగు ప్రజలు. ఈ ప్రశ్నకు కాదని 57.59% మంది చెబితే అవునని 22.80% మంది తెలిపారు. తెలియదు / చెప్పలేం అని 19.60% మంది అన్నారు.
  • 5. లాక్‌డౌన్ సమయంలో స్కూళ్లు ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం సరైనదేనా?
  • లాక్‌డౌన్ సమయంలో ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ వద్దని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ వద్దని 77.24% మంది అంటే కావాలని 15.86% మంది, తెలియదు / చెప్పలేం అని 6.90% మంది అన్నారు.
  • 6. స్కూళ్లు ఎప్పుడు తెరిస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు?
  • వ్యాక్సీన్ రిలీజ్ అయిన తర్వాతే స్కూళ్లు తెరవాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. వ్యాక్సీన్ రిలీజ్ అయిన తర్వాతే పిల్లల్ని స్కూళ్లకు పంపిస్తామని 31.86% మంది చెప్పగా, కొత్త కోవిడ్ 19 కేసులు లేనప్పుడు పంపిస్తామని 28.23% మంది, 2-3 నెలల్లో తెరవాలని 10.78% మంది, 6 నెలల్లో తెరవాలని 4.51% మంది, వెంటనే తెరవాలని 1.97% మంది అభిప్రాయ పడ్డారు.
  • 7. వ్యాక్సిన్ కనిపెట్టకముందే లేదా కొత్త కేసులు సున్నాకు రాకముందే స్కూళ్లు తెరిస్తే మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తారా?
  • వ్యాక్సిన్ రాకముందే, కొత్త కేసులు సున్నాకు రాకముందే స్కూళ్లు తెరిస్తే తమ పిల్లల్ని పంపించేందుకు సుముఖంగా లేరు తల్లిదండ్రులు. పరిస్థితి కుదుటపడకముందే స్కూళ్లు తెరిచినా తమ పిల్లల్ని పంపించమని 75.59% మంది, పంపిస్తామని 13.23% మంది, తెలియదు / చెప్పలేం అని 11.18% మంది తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Survey: Telugu people who send their children to schools until the vaccine arrives ... Here are the survey results"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0