Expectation for teacher transfers Unpublished schedule yet
టీచర్ల బదిలీలకు నిరీక్షణ
ఇంకా విడుదల కాని షెడ్యూల్ గందరగోళంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి రాని స్పష్టత.
ఇంకా విడుదల కాని షెడ్యూల్ గందరగోళంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి రాని స్పష్టత.
అమరావతి , ఆంధ్రప్రభః రాష్ట్రంలో ఉపాధ్యా య బదిలీల విషయంపై గందరగోళం నెలకొన్నది . విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే బదిలీల షెడ్యూల్ విడుదల చేసి పూర్తి చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు . అయితే ఆ సమయానికి ఆగస్టు మూడు నుంచి పాఠశాలలను ప ఎనః ప్రారంభించాలనే యోచనలో ఉండటంతో జూలై నెలాఖరులోగా బదిలీల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని విద్యాశాఖ భావించింది . రాష్ట్రంలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గకపోగా .. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో విద్యా సంవత్సరం ప్రారంభం సెప్టెంబర్ కు వాయిదా పడింది . అయితే ఆలోగా పూర్తి చేయాల్సిన బదిలీల ప్రక్రియపై మాత్రం విద్యాశాఖ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు . దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
బదిలీలతోపాటు ఉద్యోగోన్నతులు కూడా
రాష్ట్రవ్యాప్తంగాచేపట్టాల్సిన బదిలీలతో పాటు ఉద్యోగోన్నతులు కూడా నిర్వహించాల్సి ఉంది . ఈ నేపథ్యంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశాలున్నాయి . చాలా పాఠశాలల్లో ఎసీటీలతోనే బోధనావసరాలు తీరుస్తుండగా .. బదిలీలతో పాటు ఉద్యోగోన్నతులు కూడా జరిగితే కొరత ఉన్న పాఠశా లల్లో అవసరాలు తీరుతాయి . అలాగే రేషన లైజేషన్ పైనా స్పష్టత వస్తే కొత్త పోస్టులకు నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని డీఎస్సీ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . బదిలీలు , ఉద్యోగోన్న తులను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు , వైకల్యాలున్న వారు వంటి ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సి ఉంది .
సిఫార్సు బదిలీలపై ఆందోళన
రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత బదిలీలకు అవకాశం రావడంతో ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు . సాధారణ బదిలీలతోపాటు అంతర్ జిల్లా , పరస్పర బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందా అన్న ఆతృత వ్యక్తమవుతోంది . అయితే కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సిఫార్సు బదిలీలు జరుగు తుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తం మవుతోంది . ఉన్నత స్థా యిపలుకుబడులు , రాజకీ య అండదండలతో పలు చోట్ల బదిలీలు జరుగుతు న్నాయని , ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసి పారదర్శక పద్ధతి లో ఆన్‌లైన్ ద్వా రా ప్రక్రియ ప్రారం భించి , పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా యి . సిఫార్సు బదిలీలను రద్దు చేసి , వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ముందుగా ప్రకటించిన విధంగా జూలై నెలాఖరులోగా , లేదా ఆగస్టులో బదిలీలు నిర్వహించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు చేబ్రోలు శరత్ చంద్ర , పర్రె వెంకటరావు , యూటీఎఫ్ , ఫ్యాప్టో , పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి .
డేటా సేకరణ పూర్తి
రాష్ట్రంలో మూడేళ్లపైబడి , గరిష్టంగా ఎనిమి దేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయు లడేటాను ఇప్పటికే విద్యాశాఖ సేకరించింది . అంతేకాకుండా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆన్లైన్లో చేపట్టాలని కూడా నిర్ణయించింది . జిల్లాలవారీగా ఆయా యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు , వారి సీనియారిటీ , సర్వీసులను ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని భావిస్తోంది . ఈ నేపథ్యంలో జిల్లావారీగా ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది . ఒక్కో జిల్లాలో దాదాపు మూడువేల మందికిపైగా ఉపాధ్యాయులు బదిలీ కావాల్సి ఉండటంతో వారి ప్రాధాన్యాలను నమోదు చేసే ప్రక్రియ చేపట్టింది . అయితే తొలుత ప్రకటించిన మేరకు జూలై మొదటి వారంలో బదిలీల షెడ్యూల్ విడుదల చేసి , నెలాఖరులోగా ఆన్లైన్ ప్రక్రియలో కౌన్సెలింగ్ పద్ధతిలో పూర్తి చేయాల్సి ఉంది . నేటికీ నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అయినా బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి .
0 Response to "Expectation for teacher transfers Unpublished schedule yet"
Post a Comment