Repeal of Article 370 as a Class 12 text:
12వ తరగతి పాఠంగా ఆర్టికల్ 370 రద్దు: ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయం
- పన్నెండో తరగతిలోని రాజకీయ శాస్త్రంలో ఆర్టికల్ 370 రద్దు పాఠాన్ని చేరుస్తూ ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. వేర్పాటువాదంపై ఉన్న పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది. 2020-21 విద్యా సంవత్సరం సిలబస్‌కు సంబంధించి జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది.
- రాజకీయ శాస్త్రంలోని రీజినల్ ఆస్పిరేషన్స్ అధ్యాయానికి ఈ మేరకు మార్పులు చేసింది. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస, రాజకీయ అనిశ్చితి పెరిగినట్టు ఆ అధ్యయనంలో పేర్కొంది. ఈ చట్టం కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని కూడా అందులో పొందుపరిచింది
- 2002 తరువాత కశ్మీర్‌లో జరిగిన మార్పుల ఆధారంగానూ ఈ అధ్యాయానికి మార్పులు చేసింది. ఇక గత నెలలో సిలబస్‌లో కోతకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే
- భారతీయ ప్రజాస్వామ్యం, భిన్నత్వం వంటి వాటిపై ఉన్న కొన్ని పాఠాలను తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయితే ఎన్‌సీఈఆర్‌టీ మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది.
- అవన్నీ ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించే మార్పులని, కొందరు ఆరోపిస్తున్నట్టుగా ఇవి ఏ ఒక్క అంశానికీ పరిమితం కావని స్పష్టం చేసింది.
0 Response to "Repeal of Article 370 as a Class 12 text:"
Post a Comment