Financing of Sarkar school furniture prices
ప్రభుత్వ పాఠశాలల ఫర్నీచర్ ధరల ఖరారు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ‘నాడు-నేడు’లో ఫర్నీచరు, బోర్డులు, ఫ్యాన్లు, బీరువాలు, పారిశుద్ధ్య సామగ్రి, భవనాల రంగులకు ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. కేంద్రీయ టెండర్ల విధానంలో ఈ ధరలను నిర్ణయించారు. దీని ప్రకారం ఒక్కో పాఠశాలకు ఎన్ని వస్తువులు అవసరమవుతాయో ఆన్‌లైన్‌లో వివరాలు తెలపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 44,512 పాఠశాలలు ఉండగా తొలి విడతలో 15,715 పాఠశాలల్లో పనులు చేపడతారు. ఇందులో రూ.510 కోట్ల నాబార్డు నిధులతో 510 పాఠశాలల్లో పనులు చేస్తారు. దాతల సహకారంతో మరో 471 బడుల్లో పనులు జరుగుతాయి. విద్యాశాఖ 14,734 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలతో పనులు చేయిస్తోంది.
0 Response to "Financing of Sarkar school furniture prices"
Post a Comment