whatsApp: WhatsApp has got a creepy feature ..
WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది..
WhatsApp New Feature వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. మొదట బీటా యూజర్లకు రిలీజ్ చేసిన ఫీచర్‌ని ఇప్పుడు అందరు యూజర్లకు రిలీజ్ చేస్తోంది వాట్సప్.
WhatsApp New Feature వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. మొదట బీటా యూజర్లకు రిలీజ్ చేసిన ఫీచర్‌ని ఇప్పుడు అందరు యూజర్లకు రిలీజ్ చేస్తోంది వాట్సప్.
వాట్సప్ సరికొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని పరిచయం చేసింది. ఇప్పటికే వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. దీంతో స్టిక్కర్ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్దిన వాట్సప్... యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్‌ని రిలీజ్ చేస్తోంది. మీరు కూడా మీ వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉపయోగించుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు 2.20.194.7 వర్షన్, ఐఓఎస్ యూజర్లు 2.20.70.26 వర్షన్ అప్‌డేట్ చేయాలి. అప్పుడు మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్ యాప్‌లో కనిపిస్తాయి. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇతరులకు పంపడం మాత్రమే కాదు సేవ్ కూడా చేయొచ్చు. ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్స్ వాట్సప్ వెబ్ యాప్‌లో కూడా ఉన్నాయి
వాడుకొనే విధానం
ముందుగా మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయండి.
ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయండి.
ఎవరిదైనా ఛాట్ ఓపెన్ చేసి ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
మీకు ఎమొజీ, GIF, స్టిక్కర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
స్టిక్కర్ సెక్షన్ సెలెక్ట్ చేయండి.
మీకు లిస్ట్‌లో Rico's Sweet Life, Playful Piyomaru, Bright Days, Moody Foodies, Chummy Chum Chums పేర్లతో స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
ఈ స్టిక్కర్ ప్యాక్స్ అన్నీ యానిమేటెడ్ స్టిక్కర్సే.
స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించొచ్చు.
ప్రస్తుతం వాట్సప్ డిఫాల్ట్‌గా కొన్ని యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్స్ మాత్రమే అందిస్తోంది. ఇవే కాకుండా స్టిక్కర్ స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్టిక్కర్ ప్యాక్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. యానిమేటెడ్ స్టిక్కర్స్ కోసం హానికరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసేముందు రేటింగ్స్, రివ్యూస్ పరిశీలించండి.
0 Response to "whatsApp: WhatsApp has got a creepy feature .."
Post a Comment