Five New Features in WhatsApp
వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్
ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్‌లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
యానిమేటెడ్ స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్స్, వెబ్ వాట్సాప్‌కు డార్క్ మోడ్, క్వాలిటీ వీడియో కాల్స్, కైఓఎస్కు మాయమైపోయే స్టేటస్ లాంటి ఫీచర్స్‌ను కొద్దివారాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.
1.క్యూఆర్ కోడ్: ఓ వ్యక్తిని మీ వాట్సాప్‌లో జత చేసుకోవడానికి వారి మొబైల్ నంబర్‌ను అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు. ఇకపై ఒక్క క్యూఆర్ కోడ్‌తో వారి నంబర్‌ను స్కాన్ చేసి, యాడ్ చేసుకోవచ్చు.
2.యానిమేటెడ్ స్టిక్కర్స్: చాటింగ్‌ను మరింత ఫన్‌గా మార్చే యానిమేటెడ్ స్టిక్కర్స్‌ను వాట్సాప్ తీసుకురానుంది. వీటిలో వారికి నచ్చిన స్టిక్కర్స్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
3.వెబ్‌కు డార్క్‌మోడ్: ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో చాలా కాలం క్రితమే వాట్సాప్ డార్క్ మోడ్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడిక వెబ్ వెర్షన్‌కూ ఈ ఫీచర్‌ను జోడించనుంది.
4.వీడియో క్వాలిటీ: ఇటీవల గ్రూప్ వీడియో కాల్లో పాల్గొనే వారి సంఖ్యను ఎనిమిదికి పెంచిన వాట్సాప్, ఇప్పుడు కాల్ క్వాలిటీపై దృష్టి సారించింది. దాంతోపాటు కాల్లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది.
5.స్టేటస్: స్టేటస్ తనంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. కాగా, దీన్ని ఇప్పుడు కైఓఎస్కు వాట్సాప్ విస్తరించనుంది.

0 Response to "Five New Features in WhatsApp"
Post a Comment