Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vaccine working on humans

మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్​
Vaccine working on humans

నాలుగో స్టేజ్​ తొలి దశలో ఉన్నామన్న బయోఎన్​టెక్​, ఫిజెర్

ఫ్రాంక్​ఫర్ట్​, జర్మనీ: కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు మరో వ్యాక్సిన్​ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం నాలుగో స్టేజ్​ తొలిదశలో ఉన్న వ్యాక్సిన్​ , మనుషులపై చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలను ఇస్తోందని జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​, అమెరికాకు చెందిన ఫిజెర్ కంపెనీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా మనుషులపై టెస్టులు జరుపుతున్న వ్యాక్సిన్ల సంఖ్య 17కి చేరింది. వ్యాక్సిన్​ ప్రకటనలతో ఇరు కంపెనీల షేర్లు ఎగసిపడ్డాయి. బయోఎన్​టెక్​ కంపెనీ షేర్లు ఎనిమిది శాతం, ఫిజర్ షేర్ 4.4 శాతం పెరిగాయి. మరోవైపు కోవిడ్​–19 వ్యాక్సిన్​కు ప్రయత్నిస్తున్న మోడర్నా, నోవావాక్స్​ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

 24 మంది వాలంటీర్లపై టెస్టులు బీఎన్​టీ162బీ1 అనే మందును 24 మంది వాలంటీర్లకు ఇవ్వగా 28 రోజుల తర్వాత వారి శరీరంలో పెద్దమొత్తంలో కరోనా వైరస్​ యాంటీ బాడీస్​ తయారయ్యాయని బయోఎన్​టెక్​ వెల్లడించింది

వీరికి మూడు వారాల్లో రెండు డోసుల చొప్పున ఇంజెక్షన్​ ఇచ్చినట్లు తెలిపింది. రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి నలుగురిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం( తాత్కలిక సైడ్​​ ఎఫెక్ట్) వచ్చినట్లు వివరించింది.

మరో గ్రూప్​లోని వారికి ఎక్కువ మోతాదులో ఒకసారి మాత్రమే మూడో డోస్​ ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్పింది. ‘మా ట్రయల్స్​లో వ్యాక్సిన్​ మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ట్రయల్స్​ నిర్వహిస్తాం’ అని బయోఎన్​టెక్​ సీఈవో సాహిన్​ పేర్కొన్నారు.

 అన్ని అనుమతులు వస్తే జులై​ చివరకు అమెరికా, యూరప్​లోని 30 వేల ఆరోగ్యమంతమైన వ్యక్తులపై బయోఎన్​టెక్​, ఫిజర్​ వ్యాక్సిన్​ను పరీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్​ అనుమతులు జారీ చేస్తే, 2020 డిసెంబర్​ నాటికి ఒక కోటి వ్యాక్సిన్లు, 2021 చివరకు 120 కోట్ల వ్యాక్సిన్లను కంపెనీ రెడీ చేస్తుంది.

కరోనాను ఎదుర్కొనేందుకు బయోఎన్​టెక్​ మరో మూడు రకాల వ్యాక్సిన్లపై కూడా ప్రయోగాలు చేస్తోంది. వీటి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vaccine working on humans"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0