Good news for AP people .. CM Jagan's decision on Aadhaar
ఏపీవాసులకు గుడ్ న్యూస్ .. ఆధార్‌పై సీఎం జగన్ నిర్ణయం ..
ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది .
ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది .
ఆధార్ కార్డు.. ప్రస్తుతం ఇది తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం పథకంలో లబ్ధి పొందాలన్నా.. మన ఐడెంటిటీని నిరూపించుకోవాలన్నా.. ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లేనివారు?, అందులో తప్పులు ఉన్నవారు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వాటిని సరిచేసుకునేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయే పరిస్థితులు ఉన్నాయి. మండలానికో.. లేక మరెక్కడైనా ఒక్క ఆధార్ సేవ కేంద్రం ఉంటే.. దాన్ని ముందు గంటల తరబడి పడిగాపులు కాసి పని చేయించుకోవాల్సిన పరిస్థితి. దీన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు వంటి సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఆధార్ కార్డులు ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సచివాలయాల్లోనే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎక్కడెక్కడ ఈ ఆధార్ సేవలు ప్రారంభించాలని విషయంపై అధికారులతో ప్రభుత్వం చర్చిస్తోంది. త్వరలోనే ఏపీవాసులకు ఆధార్ తిప్పలు తప్పనున్నాయి.
0 Response to "Good news for AP people .. CM Jagan's decision on Aadhaar"
Post a Comment