Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

మోదీ మెచ్చుకుని 
DRDO లో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు గురించి తెలుసుకుందాం.
Inspiration

ఇతని పేరు ప్రతాప్, వయస్సు కేవలం 21 ఏళ్ళు..
కర్ణాటక ,మైసూరు సమీపంలోని కాడైకుడి స్వంత గ్రామం..
తండ్రి ఒక సాధారణ రైతు కూలీ..
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి..
ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి..
స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన 100-150/- డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్ళి ISRO, NASA, BOEING, ROLLS_ROYCE, HOWITZER Etc గురించి సోధించేవాడు, అక్కడి సైంటిస్టులకు ఈ-మెయిళ్ళు పంపేవాడు..
రిప్లై మాత్రం వచ్చేది కాదు, అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు..

ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ, ఇంజనీరింగ్_ఇన్_ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల, కానీ పేదరికం కారణంగా B.Sc (Physics) కోర్సులో చేరవలసివచ్చింది.. అయినా నిరాశపడలేదు..
హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో, బయటకు తోసేశారు..
బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు..
మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు..

మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు..
పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు..
ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది.. ఇ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట..

డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు..
అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి..
ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది..
దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు..
ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది.. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభించింది..ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు..

జపాన్‌కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం..
అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి..
చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు..
విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు..
ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా 60,000/- ఇచ్చింది..
బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు..

బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు..
అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచివెళ్ళి చివరకు గమ్యం చేరాడు..

అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు..
అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి..
కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు..
 అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, పక్షికన్ను మాత్రమే కనపడింది..
అలాగే మన ప్రతాప్‌కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది..
తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు..
వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు..
మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు..
రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు..
ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు..
నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు..
ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్‌కు వెళ్ళింది..
తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది..
అప్పిటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు..

ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది: "Please Welcome Mr_Pratap, First Prize, From INDIA.."
అంతే లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు..
రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది..
ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు..
మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సమారు 7 లక్షల రూపాయలు)

3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు..
"నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్.." అన్నారు
"నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాత్రృభూమికి సేవచేయడమే నా సంకల్పం.." అని వారికి క్రుతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు..

ఈవిషయం స్థానిక BJP MLA మరియు MP లకు తెలిసింది..
వారు అతని ఇంటికెళ్ళి అభినందించి, ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్‌మెంట్ ఇప్పించారు..
మోదీజీ అతనిని అభినందించి DRDOకు రెఫర్ చేశారు..
ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు..
నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ DRDO కు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు....!!

Source: Asthram News

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Inspiration"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0