Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Smart TVs in government schools

సర్కారు బడుల్లో స్మార్ట్‌ టీవీలు
వేల పాఠశాలల్లో ఏర్పాటుకు సన్నాహాలు
రూ.45కోట్లకు టీసీఎల్‌ కంపెనీకి కాంట్రాక్టు
ఓ కీలక వ్యక్తి సిఫారసుతో టెండర్‌ ఖరారు?
Smart TVs in government schools


  • రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో త్వరలో స్మార్ట్‌ టీవీలు కనిపించనున్నాయి. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 10వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
  • ఇందుకోసం ఏపీఈడబ్ల్యూఐడీసీ పిలిచిన ఈ-టెండర్లలో టీసీఎల్‌, మైక్రోమాక్స్‌ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్‌ టెండర్లలో ఒక్కో టీవీ ధరను రూ.37వేలకు కోట్‌ చేసిన టీసీఎల్‌కు కాంట్రాక్టు ఖరారైంది
  • మైక్రోమాక్స్‌ రూ.76వేలకు కోట్‌ చేసినందున తక్కువ ధరకు కోట్‌ చేసిన టీసీఎల్‌కే టెండర్‌ ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
  • 10వేల టీవీల సరఫరా, సంబంధిత పరికరాల కోసం రూ.45కోట్లు వ్యయం చేయనున్నారు. 
  • రానున్న 3నెలల్లో టీవీలను స్కూళ్లకు సరఫరా చేయనున్నారు.
  • కాగా, ప్రభుత్వ పాఠశాలలకు టీసీఎల్‌ కంపెనీకి చెందిన స్మార్ట్‌ టీవీల ఆర్డర్‌ ఖరారు చేయడంలో ఓ కీలక వ్యక్తి సిఫారసు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
  • ముందస్తుగా ఆ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యక్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
  • ఇదిలా ఉండగా, 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధనను ప్రవేశపెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం... రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించించిన విషయం విదితమే.
  • ఒక్కో ల్యాబ్‌ ఏర్పాటుకు ఇప్పటికే రూ.లక్ష మంజూరు చేసింది. 
  • పాఠశాలలోనే ఒక గదిని దీనికోసం ప్రత్యేకించేలా ఆదేశాలు ఇచ్చింది. 
  • అయితే ఈ ల్యాబ్‌ల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Smart TVs in government schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0