Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rice Carde Income Certificate

బియ్యం కార్డే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌
కార్డు లేకుంటే సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో ఆదాయ ధ్రువీకరణ పత్రం
సర్టిఫికెట్‌కు నాలుగేళ్ల కాలపరిమితి
రెవెన్యూ శాఖ తాజా నిర్ణయం
ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
Rice Carde Income Certificate

 బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌)గా పరిగణించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పేదల వద్ద బియ్యం కార్డులు లేనిపక్షంలో వారి నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ను తీసుకుని దాని ఆధారంగా నాలుగేళ్ల కాలపరిమితితో ప్రత్యేకంగా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని ఆదేశించింది. సర్టిఫికెట్‌పై ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు గతంలో జారీచేసిన జీఓ 186, 229ల స్థానంలో కొత్తగా 205ని జారీ చేసింది. పేదల రేషన్‌ కార్డునే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌గా పరిగణించాలని 2017లో జారీచేసిన జీవో 229లోని కొన్ని ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయ స్ఫూర్తికి అనుగుణంగా అమలు కాలేదని రెవెన్యూ శాఖ అభిప్రాయపడింది. దీంతో రెవెన్యూశాఖ బియ్యం కార్డును ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌గా పరిగణించాలని ఆదేశిస్తూ తాజా జీవోని జారీ చేసింది. బీపీఎల్‌కి చెందని, బియ్యం కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం ది. రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై సెల్ఫ్‌ డిక్లరేషన్‌తోపాటు దరఖాస్తును సమర్పించారు. దీనిపై విచారణ చేసి ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. 
తాజా జీవోలోని కొన్ని మార్గదర్శకాలు..

  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్పొరేషన్‌లు, విద్యాసంస్థలు బియ్యం కార్డునే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌గా పరిగణించి పేద విద్యార్థులను చేర్చుకోవాలి.  
  • సంక్షేమ పథకాల అమల్లో ఈ కార్డే ప్రామాణికం.
  • ప్రభుత్వ విభాగాలు, సంస్థలు లబ్ధిదారుడి ఒరిజినల్‌ ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ను తమ వద్ద ఉంచుకోవడానికి వీల్లేదు.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rice Carde Income Certificate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0