This is the gadget that should be in every home during Corona… !!!
కరోనా సమయంలో ప్రతీ ఇంట్లో ఉండాల్సిన గ్యాడ్జెట్ ఇదే…!!!
కరోనా కాలంలో ప్రస్తుతం అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగ పడుతున్నాయి. వీటి డిమాండ్ కూడా పెరిగింది. ముఖ్యంగా డిజిటల్ థర్మామీటర్ ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. అయితే దీని ద్వారా కేవలం జ్వరం ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. అయితే దీని ద్వారా కరోనా ఉందా లేదా అనేది తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే మరో ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. అయితే దీన్ని కనుగొనేందుకు ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతోందో కనుగొనవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది.
శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మరి, దీన్ని గుర్తించాలంటే నిర్ణీత వ్యవధుల్లో మన శరీరంలో ఆక్సిజన్ స్థాయుల్ని మానిటర్ చేసుకోవడం మంచిది. ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించవచ్చు. ప్రతి ఇంట్లో పల్స్ ఆక్సీమీటర్ తప్పకుండా ఉండాల్సిందే. ఆక్సీ మీటర్ చిన్న క్లిప్ మాదిరిగా ఉంటుంది. దానిపై భాగంలో ఒక చిన్న మానిటర్ ఉంటుంది.. ఇప్పుడు ఈ పరికరం మధ్య భాగంలో ఉండే ఖాళీలో మన చూపుడు వేలిని ఉంచి.. దానిపై ఉండే బటన్‌ని నొక్కితే, నిర్ణీత వ్యవధిలో మానిటర్‌పై గుండె కొట్టుకునే వేగం, ఆక్సిజన్ స్థాయులు డిస్‌ప్లే అవుతాయి. ఈ పరికరం నాణ్యత, డిజైన్‌ను బట్టి మార్కెట్లో దీని ధర రూ. 1,799 నుంచి రూ. 4,750 వరకు ఉంది.
0 Response to "This is the gadget that should be in every home during Corona… !!!"
Post a Comment