Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Transfers

ఉద్యోగుల్లో ఉత్కంఠ
ప్రస్తుత బదిలీలపై స్థానికత భయం
జిల్లాల పునర్విభజనపై సర్వత్రా చర్చ
Transfers

ఉదాహరణకు   కృష్ణ జిల్లా 
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన నేపథ్యంలో జిల్లాలో ఓ వైపు రాజకీయ వేడి రాజుకోగా, మరో పక్క ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ నియోజకవర్గ స్థానాలు ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా రెండుగా విడిపోతుండగా, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సీనియారిటీ, స్థానికత తదితర అంశాలపై చర్చించుకుంటున్నాయి. 
జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు 47,512 మంది వివిధ శాఖల్లో, వివిధ యాజమాన్యాల్లº పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో నూతన ప్రదేశాలను కోరుకునే వారిలో పునర్విభజన టెన్షన్‌ పట్టుకుంది. ఉద్యోగులను నూతన జిల్లాకు బదలాయించడం వల్ల సర్వీసు సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశముందని, ప్రారంభ అవరోధాలను అధిగమిస్తే మాత్రం సత్ఫలితాలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో ఆరంభంలో కష్టాలు ఎదురైనా ప్రస్తుతం తొలగిపోయాయని నాయకులు పేర్కొంటున్నారు. ఏలూరు పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు కొత్త జిల్లాలోకి వెళ్లనున్నాయి. స్థానికంగా ఉండే నాయకులు నూజివీడును విజయవాడ జిల్లాలో, కైకలూరును మచిలీపట్నంలో కలపాలని, లేకుంటే గుడివాడ జిల్లా చేసి అందులో ఉంచాలని కోరుతున్నారు. పునర్విభజనలో పక్క జిల్లాకు కేటాయించటం వల్ల సర్వీసు ర్యాంకులు, పదోన్నతుల్లో కొంత మందికి అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. వేరే జిల్లాకు వెళ్లవలసి వచ్చినపుడు అక్కడ సీనియారిటీ ఎలా అన్నదానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికత సమస్య..:
పుట్టిన ప్రదేశం లేదా వరుసగా ఏడేళ్లు చదువుకున్న ప్రాంతాన్ని బట్టి ఇప్పటి వరకు స్థానికతను పరిగణిస్తున్నారు. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. జిల్లాల విభజన వల్ల తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరగనున్న ఉపాధ్యాయ బదిలీల్లో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి సీనియారిటీ రూపొందించాలి
ఉద్యోగులకు జిల్లా ఉమ్మడి సీనియారిటీ ప్రకారమే ఏ జిల్లాకు కేటాయించినా పదోన్నతులు కల్పించాలి. జిల్లాలో ఉద్యోగులందరినీ కొత్తగా ఏర్పడే మూడు జిల్లాల్లో వారికి ఇష్టమైన ఐచ్ఛికాన్ని ఎంచుకొనేలా అవకాశమివ్వాలి.

జి.మాధవరావు, పంచాయతీరాజ్‌ ఉద్యోగి


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Transfers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0