Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We will send you to bondage as soon as the vaccine arrives .... Interesting things come to light in the education survey

వ్యాక్సిన్ వచ్చాకే బడికి పంపిస్తాం .... విద్యాశాఖ సర్వేలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు .... ?
We will send you to bondage as soon as the vaccine arrives .... Interesting things come to light in the education survey

భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరికొన్ని రోజుల్లో దేశంలో లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన వవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,078 కేసులు నమోదు కాగా 779 మందిప్రాణాలు కోల్పోయారు. నిన్నటివరకు దేశంలో 35,132 మరణాలు నమోదు కాగా ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానానికి చేరింది.
దేశంలోని ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా విద్యాశాఖ చేసిన సర్వేలో వ్యాక్సిన్ వచ్చాకే పిల్లలను బడికి పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాఠశాలలను ప్రారంభించినా రోజు విడిచి రోజు నడపాలని 45 శాతం...
ప్రతిరోజూ నడపాలని 24 శాతం... షిఫ్ట్ పద్దతిలో నిర్వహించాలని మిగిలిన వాళ్లు చెబుతున్నారు.
హైదరాబాద్ లో 60 శాతం మంది తల్లిదండ్రులు వ్యాక్సిన్ వచ్చాకే బడికి పంపుతామని చెప్పగా 30 శాతం మంది తల్లిదండ్రులు మాత్రం దసరా తర్వాత పంపుతామని చెబుతున్నారు. మిగిలిన పది శాతం మంది మాత్రం పిల్లలను బడికి పంపడానికి సిద్ధమేనని తెలిపారు. 39 శాతం మంది సిలబస్ ను 50 శాతం తగ్గించాలని సూచించగా 26 శాతం మంది మాత్రం సిలబస్ ను తగ్గించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మెజారిటీ తల్లిదండ్రులు పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు ఆన్ లైన్ ద్వారా చదువు కొనసాగించాలని చెప్పారు. మొబైల్ ద్వారా బోధనకు 41 శాతం మంది అంగీకరించగా టీవీ ఛానెళ్ల ప్రసారాలకు 27 శాతం మంది ఓటేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా బోధించాలని మిగిలిన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ ద్వారా బోధనకు 52 శాతం మంది విద్యార్థులకు మొబైల్ ఇస్తామని చెప్పగా 24 శాతం మంది ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పారు. మిగిలిన వాళ్లు ట్యాబ్ ఇస్తామని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We will send you to bondage as soon as the vaccine arrives .... Interesting things come to light in the education survey"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0