Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do your children use smartphones excessively?

మీ పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్ ని వాడతన్నారా
Do your children use smartphones excessively?

ఎప్పుడో ఓసారి.. అది కూడా అరగంటో.. గంటో.. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించేవి.. కరోనా పుణ్యమా అని వాళ్లు స్మార్ట్‌ఫోన్లు వాడడం ఎక్కువైపోయింది.. ఎంతలా అంటే.. ఉదయం లేచినప్పట్టి నుంచి రాత్రి పడుకునే వరకు వారిచేతిలో ఉంటున్నాయి.. ఉదయం కష్టంగా 8 గంటలకు లేచి హడావుడిగా రెడీ అయిపోయి.. 9 గంటల నుంచి ఆన్‌లైన్ క్లాసుల్లో కూర్చుంటున్నారు.. ఆ తర్వాత.. హోం వర్క్‌లు కూడా మెసేజ్‌గా వస్తుండడంతో.. వారిచేతిలోనూ ఫోన్లు ఉంటున్నాయి.. ఇక ఆ రెండు ముగిసినా.. గేమ్‌లు, సోషల్ మీడియాలో గడపడం.. ఇలా.. మొత్తంగా ఎలక్ట్రానిక్ వస్తువులతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు.. అయితే, ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఎనిమిదేళ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్‌ ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ఎనిమిది నుంచి పదేండ్లలోపు వారికి రోజుకు కేవలం అరగంట మాత్రమే ఇవ్వాలంటున్నారు నిపుణులు.

చిన్నారులు టెక్నాలజీకి బానిసలుగా మారుతున్నారు.. అనే అంశంపై మహిళా భద్రతా విభాగం నిర్వహించిన వెబినార్‌లో సైబర్‌ సెక్యురిటీ నిపుణురాలు జూహికౌల్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలోని 18 వరకు పాఠశాలల్లో దాదాపు 5 వేల మందికి ఇప్పటికే ఈ అంశంపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పిల్లలను మొబైల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వ్యసనం నుంచి బయటికి తెచ్చేందుకు వారిని రెండువారాలపాటు డిజిటల్‌ క్వారంటైన్ అంటే వారికి మొబైల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ వంటి ఏ వస్తువు ఇవ్వకుండా చేసినట్టు వెల్లడించారు.. అతిగా స్మార్ట్‌ఫోన్లు వాడే పిల్లల్లో ఈ లక్షణాలను గుర్తించాలని సూచించారు.. రోజులో 4 గంటల కంటే ఎక్కువ సమయం సోషల్‌ మీడియా సైట్లలో గడపడం. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో సరిగా మాట్లాడకపోవడం... మొబైల్‌తో, ల్యాప్‌టాప్‌తోనే గంటలకొద్దీ గడపడం, పది నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఫోన్‌ వదిలి ఉండలేకపోతున్నట్టయితే అదో పెద్ద హెచ్చరికగా చెబుతున్నారు.. నిద్రపట్టకపోవడం, కండ్లకింద మచ్చలు, తలనొప్పి, ఫోన్‌ వాడవద్దని వారిస్తే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కోపపడం కూడా.. వారు క్రమంగా వాటికి బానిసలుగా మారుతున్నట్టే అని సూచించారు.. అయితే.. వాటి నుంచి బయటపడాలంటే.. పిల్లలకు ఫోన్లు, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్‌ వాడకానికి రోజుకు కొంత సమయమనే నిబంధన పెట్టాలి అని సూచించారు.. ఇతర కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసేలా, ఇంటి పనుల్లో వారి బాధ్యత పెంచేలా చూడాలని.. రోజులో గంటపాటు శారీరక శ్రమ కల్పించాలని.. వారాంతాల్లో ఎలాంటి గ్యాడ్జెట్లు పూర్తిగా వాడకుండా ఇతర వ్యాపకాలవైపు దృష్టి మళ్లించాలి అని సూచించారు. ఇప్పటికే ఈ ఊబిలో ఎంతమంది పిల్లలు కూరుకుపోయారు.. వారిని జాగ్రత్తగా బయటకు లాగే ప్రయత్నం చేయకపోతే కష్టమే మరి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do your children use smartphones excessively?"

Post a comment