Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let us know the effect of corona on our income

మన ఆదాయంపై కరోనా ప్రభావం ఎంతో తెలుకుందాం
Let us know the effect of corona on our income

కరోనా వల్ల దేశ ప్రజల తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఎస్​బీఐ తాజా నివేదిక. గోవా, దిల్లీలో సగటు ఆదాయం ఎక్కువగా క్షీణించొచ్చని పేర్కొంది. ఇందులో టాప్- 5లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తలసరి ఆదాయం తగ్గుదలపై ఎస్​బీఐ తెలిపిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా సంక్షోభం వల్ల ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోనుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. చాలా నివేదికలు, పరిశోధనలు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటీవల ఓ సర్వే ప్రకారం... దిల్లీ, గోవా, తెలంగాణ, హరియాణాలో నివసించే వారి తలసరి ఆదాయంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిసింది.
తలసరి ఆదాయాల్లో తగ్గుదల ఇలా..

  • ఎస్​బీఐ సోమవారం విడుదల చేసిన ఎకోరాప్​ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో నివసించే వారు ఈ ఆర్థిక సంవత్సరంలో తమ సగటు ఆదాయంలో రూ.87,223 కోల్పోవచ్చని వెల్లడైంది. ఇది జాతీయ సగటు రూ.27,000తో పోలిస్తే చాలా ఎక్కువ.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో గోవాలో నివసించే వారి తలసరి ఆదాయం అత్యధికంగా రూ.1,05,906 తగ్గొచ్చని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది.
  • రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో తలసరి ఆదాయం నష్టం వరుసగా రూ.47,727, రూ.67,883గా ఉండొచ్చని పేర్కొంది.
  • బిహార్​, అసోంలో నివసించే వారి తలసరి అదాయం అత్యల్పంగా రూ.8,739, రూ.9,800 తగ్గొచ్చని నివేదిక వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా ఇలా..

**************"****************"*******
రాష్ట్రం పేరు.   తలసరి  ఆదాయం 
                                 లో నష్టం.     

**************"*****************"********
తెలంగాణ              ₹ 67,883
ఆంధ్రప్రదేశ్.            ₹ 47,727
మహారాష్ట్ర.            ₹ 38,881
తమిళనాడు.          ₹ 45,857
ఉత్తరప్రదేశ్.            ₹ 14,006
గుజరాత్.                ₹ 45,018
కర్ణాటక.                   ₹ 39,127
బంగాల్                    ₹ 19,965
రాజస్థాన్                  ₹ 24,085
డిల్లీ                          ₹ 87,223
కేరళ                         ₹ 44,684
హరియాణ.               ₹ 52,696
మధ్యప్రదేశ్               ₹ 16,374
పంజాబ్.                   ₹ 34,081
బిహార్.                      ₹ 8,739
ఒడిశా.                      ₹ 14,745
ఝార్ఖండ్                    ₹ 12,887
 ఛత్తీస్ గఢ్                 ₹ 12,182
ఉత్తరాఖండ్.              ₹ 32,262
అసోం                         ₹ 9,800
జమ్మూకాశ్మీర్              ₹ 20,145
హిమాచల్ ప్రదేశ్          ₹ 31,857
గోవా                            ₹ 1,05,906
చండీగఢ్                      ₹ 77,545

**************"****************"*******
రాష్ట్రాల వారీగా సగటు ఆదాయం తగ్గుదల
జీఎస్​డీపీ క్షీణత రూ.38 లక్షల కోట్లు!
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్​డీపీ) అంచనాల ఆధారంగానే తలసరి ఆదాయంపై ప్రభావాన్ని లెక్కించినట్లు ఎస్​బీఐ ఎకోరాప్​ తెలిపింది.
  • కరోనా సంక్షోభంతో రాష్ట్రాల జీఎస్​డీపీ రేటు 16.9 శాతం తగ్గొచ్చని పేర్కొంది ఎస్​బీఐ. ఇది దాదాపు రూ.38 లక్షల కోట్లకు సమానం.
  • ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ క్షీణతలో టాప్​ 10 రాష్ట్రాల వాటానే 73.8 శాతం ఉంటుందని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది. అందులో మహారాష్ట్ర 14.2 శాతం, తమిళనాడు 9.2 శాతం, ఉత్తర్​ప్రదేశ్​ 8.2 శాతం చొప్పున వాటా ఉండొచ్చని పేర్కొంది.
నాలుగ త్రైమాసికాల్లోనూ ప్రతికూల వృద్ధే..
  • ఇదిలా ఉండగా.. మేలో విడుదల చేసిన అంచనాలతో పోలిస్తే.. తాజా నివేదికలో దేశ జీడీపీ వృద్ధి రేటు క్షీణత అంచనాను 20 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది ఎస్​బీఐ.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సం నాలుగు త్రైమాసికాల్లోనూ ప్రతికూల వృద్ధి.. పూర్తి సంవత్సరానికి రెండంకెల వృద్ధి క్షీణత నమోదు కావచ్చని ఎస్​బీఐ అంచనా వేసింది.
  • దీనితో ఆగస్టు 31న జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్ఓ) విడుదల చేయనున్న 2020-21 జీడీపీ వృద్ధి రేటు గణాంకాలపై ఆసక్తి పెరిగింది.


రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 6.9 శాతం (ఎన్​ఎస్​ఓ అధికారిక లెక్కల ప్రకారం) కన్నా ఎక్కువే ఉండొచ్చని ఎస్​బీఐ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ఎన్​ఎస్​ఓ ప్రకటించిన లెక్కలు అంచనాలు మాత్రమేనని తెలిపింది. వాస్తవ రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతానికిపైగా నమోదై ఉంటుందని అంచనా వేసింది.

జీడీపీ క్షీణత, వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో.. వినియోగం, రికవరీ ఆశలు ఆవిరవుతున్నాయని ఎస్​బీఐ అభిప్రాయపడింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let us know the effect of corona on our income"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0