Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For Secretariat examinations in the State The full schedule for the day is announced with no test description


రాష్ట్రంలో సచివాలయ పరీక్షలకు
 సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించినారు ఏరోజు ఏ పరీక్ష వివరణ

నిరుద్యోగ యువతకు నిజంగానే ఇది గుడ్ న్యూస్... రాష్ట్ర ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీని భారీగా చేపట్టింది. వాటికి కొనసాగింపుగా మలివిడత మరొకసారి గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల కోసం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే... పరీక్షలు నిర్వహించే సమయం ఆసన్నమయ్యే తరుణంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం కార ణంగా జరగాల్సిన పరీక్షలు వాయిదా ప డ్డాయి. కాగా ఇటీవలే ఈ సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 14 పరీక్షలకు సంబంధించి తేదీలను ప్రకటించారు. ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
విభాగం వారీ పరీక్ష తేదీలు:

పంచాయత్ సెక్రెటరీ / మహిళా పోలీస్ / వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 2020 సెప్టెంబర్ 20 ఉదయం

పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్- సెప్టెంబర్ 20, 2020 మధ్యాహ్నం

వీఆర్ఓ / విలేజ్ సర్వేయర్- సెప్టెంబర్ 21, 2020 ఉదయం

ఇంజనీరింగ్ అసిస్టెంట్ / వార్డు ఎమినిటీస్ సెక్రటరీ- సెప్టెంబర్ 21, 2020 మధ్యాహ్నం

వార్డు శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ- సెప్టెంబర్ 22, 2020 ఉదయం

వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2- సెప్టెంబర్ 22, 2020 మధ్యాహ్నం

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 23, 2020 ఉదయం

వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ- సెప్టెంబర్ 23, 2020 మధ్యాహ్నం

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ- సెప్టెంబర్ 24, 2020 ఉదయం

ఏఎన్ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్ 3)- సెప్టెంబర్ 24, 2020 మధ్యాహ్నం

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 ఉదయం

విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్- సెప్టెంబర్ 25, 2020 మధ్యాహ్నం

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020 ఉదయం

విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్- సెప్టెంబర్ 26, 2020 మధ్యాహ్నం
మొత్తంగా 14 పరీక్షలకు సంబంధించి న షెడ్యూల్ను పైన సూచించిన విధంగా రూపొందించారు. గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి మొత్తంగా 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For Secretariat examinations in the State The full schedule for the day is announced with no test description"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0