Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS RRB 2020 Releases exam schedule for replacement of total 9640 bank jobs

IBPS RRB 2020 మొత్తం 9640 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి exam షెడ్యూల్ విడుదల.
IBPS RRB 2020 Releases exam schedule for replacement of total 9640 bank jobs

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS రీజనల్ రూరల్ బ్యాంకు-RRB ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారికి శుభవార్త. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ప్రిలిమ్స్ సెప్టెంబర్‌లో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ అక్టోబర్‌లో నిర్వహిస్తున్నట్టు ఐబీపీఎస్ ప్రకటించింది. ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ -1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 21 వరకు దరఖాస్తుల్ని కూడా స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా, ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల్ని సింగిల్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తోంది. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ తేదీలను వెల్లడించనుంది ఐబీపీఎస్. ఈ పరీక్షలకు సంబంధించి ఐబీపీఎస్ ప్రకటించిన షెడ్యూల్ ఇదే.

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 జాబ్స్... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల భర్తీ SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 3850 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2020 సెప్టెంబర్ 12, 13, 19, 20, 26
ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామినేషన్- 2020 అక్టోబర్ 18
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామినేషన్- 2020 అక్టోబర్ 31ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 18

వాస్తవానికి ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలకు ముందుగానే షెడ్యూల్ ప్రకటించింది ఐబీపీఎస్. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా షెడ్యూల్ మారింది. కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో ఈ పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉండొచ్చు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. అందుకే అభ్యర్థులు పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో అవుతూ ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS RRB 2020 Releases exam schedule for replacement of total 9640 bank jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0