Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Some important points about e-SR

E-SR గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు
Some important points about e-SR

E SR కొరకు ఆఫీస్ నుండి SR తీసుకుందాము అని పరుగు పరుగున వెళ్ళకండి.SR తీసుకునే ముందు ముఖ్యముగా ఒక వైట్ పేపర్ తీసుకుని  ఇప్పటి వరకు మీ సర్వీస్ నందు ఏయే ENTRIES ఉండవలెనో ఆ పేపర్ మీద రాసుకుని SR తీసుకున్న తరువాత మీ SR నందు మీరు పేపర్ మీద రాసుకున్న అన్ని ENTRIES ఉన్నవో లేదో CHECK చేసుకుని లేని యెడల ఆఫీస్ సిబ్బందితో ఆ ENTRIES రాయించుకుని DDO గారి SIGN చేయించుకోగలరు.

అంతే కాక మీ సర్వీస్ నందలి అందరి DDO ల SIGNATURES ఆ ENTRIES వద్ద ఉన్నవో లేవో సరి చూసుకుని లేని యెడల వారితో కూడా SIGN చేయించుకోగలరు.

SR నందు మీరు చూసుకోవలసిన ENTRIES:


  • 1.1ST ND 2ND పేజీ లో మీ యొక్క వ్యక్తిగత వివరాలు అయినటువంటి మీ పేరు మీ ఇంటి పేరుతో సహా, మీ చిరునామా,మీ పుట్టిన తేది, మీ పుట్టు మచ్చలు.
  • 2.మీ EDUCATIONAL QUALIFICATIONS పూర్తిగా. చాలా మంది జాబ్ వచ్చిన తరువాత కూడా HIGHER STUDIES చదువుతారు. వాటిని కూడా నమోదు చేయించుకోవాలి.
  • 3.పోలీస్ ENQUIRY అయిన వారు DEO నుండి కనుక SERIVICE REGULARISATION చేయించుకున్న యెడల దాని యొక్క నమోదు.
  • 4.మీరు ఈ JOB ను లోకల్ స్టేటస్ యందు కానీ NON లోకల్ స్టేటస్ నందు కానీ పొంది ఉన్నారా అనే దాని యొక్క నమోదు.
  • 5.ఇప్పటి వరకు మీరు తీసుకున్న INCREMENTS దాని తాలూక PAY స్కేల్ ల నమోదు.
  • 6.మీరు జాయిన్ అయిన దగ్గర నుండి వన్ ఇయర్ పూర్తి అయిన తరువాత వేసే సర్వీస్ వెరిఫికేషన్ అన్నిటి యొక్క నమోదు.
  • 7.మీకు కట్ అయ్యే GIS మరియు APGLI నమోదు. ఒకవేళ మధ్యలో APGLI పెంచిన వాటి యొక్క నమోదులు.
  • 8.PRAN నెంబర్ నమోదు.
  • 9. 6/12/18/24 స్కేల్స్ యొక్క నమోదులు
  • 10.అన్ని PRC ల నమోదులు.
  • 11.మీరు వినియోగించుకున్న HALF PAY వివరాలు. ఒకవేళ వినియోగించుకోని యెడల SR చివర HALF PAY LEDGER BALANCE వివరాల నమోదు.
  • 12.SR చివరన మీకు సర్వీస్ నందు వచ్చు ELS, మరియు సమ్మర్ నందు ట్రైనింగ్స్ కానీ ఏమైనా DUTIES కానీ చేసిన వచ్చు ELS వివరాలు.
  • 13.ఒకవేళ మీరు ELS ను లీవ్ గా వాడు కున్న లేక ENCASH చేసుకున్న వాటి యొక్క నమోదులు.
  • 14.LADY టీచర్స్ ఉపయోగించుకునే MATETNITY లీవ్,ABORTION లీవ్, CHILD CARE లీవ్ నమోదులు.
  • 15.మేల్ ఎంప్లాయిస్ ఉపయోగించుకునే PATERNITY లీవ్ నమోదు.
  • 16.ఎవరైనా స్టడీ లీవ్ వినియోగించుకుంటే వాటి నమోదు.
  • 17.సర్వీస్ నందు ఉపయోగించుకునే ఏ ఇతర ప్రయోజనాల యొక్క నమోదులు.
  • 18.ఎవరైనా ఏ ఇతర జీత ప్రయోజనాలు పొందిన వాటి వివరాలు.LIKE... STEPUP, NOTIONAL INCREMEMTS, హామీపత్రాల వివరాల నమోదు.
  • ఇలా మన సర్వీస్ నందు మనం పొందే ప్రేతి దాని వివరాలను నమోదు చేసారో లేదో చూసుకుని SR ను తీసుకున్న ESR చేసుకునుటకు ప్రయోజనం ఉంటుంది.
  • అందుకనే మీరు మీ వివరాలను ఒక పేపర్ పై రాసుకుని SR తీసుకున్న తరువాత చెక్ చేసుకుని SR ను పొందగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Some important points about e-SR"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0