Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alert for gas cylinder users ... Explanation of what to do if there is less gas in the cylinder

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్ సిలిండర్ లో తక్కువ గ్యాస్  వస్తుందా ఐతే ఎమ్ చేయాలో వివరణ.
Alert for gas cylinder users ... Explanation of what to do if there is less gas in the cylinder

ఎల్‌పీజీ బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని డెలివరీ బాయ్‌కి తెలియజేయడం వంటివి కూడా వీటిల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారు. అయితే కొంత మంది కొన్ని సందర్భల్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోయిందని భావిస్తుంటారు. దీనికి కారణం గ్యాస్ ఎక్కువగా ఉపయోగించి ఉంటమని మళ్లీ సర్దిచెప్పుకుంటారు. అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోవడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. అదే గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా రావడం. మోదీ సర్కార్ గత నెలలో కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ను అమలులోకి తీసుకువచ్చారు
ఈ నేపథ్యంలో మీరు మీ గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా వస్తోందని భావిస్తే.. కన్సూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించొచ్చు. గ్యాస్ ఏజెన్సీలు మోసానికి పాల్పడితే, వినియోగదారుల హక్కులను హరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ బరువును కచ్చితంగా తెలుసుకోవాలి. డెలివరీ బాయ్ వద్ద బరువు చూసే మెషీన్ ఉంటుంది. దీని ద్వారా సిలిండర్ బరువు చూడాలి. చాలా మంది ఇలా చేయడం లేదు.

డైరెక్ట్‌గా సిలిండర్ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వినియోగదారులే నష్టపోవాల్సి వస్తుంది. గ్యాస్ తక్కువగా వస్తే గ్యాస్ ఏజెన్సీకి ఆ విషయం తెలియజేయండి. ఏజెన్సీ మీ ఫిర్యాదుపై స్పందించకపోతే కన్సూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alert for gas cylinder users ... Explanation of what to do if there is less gas in the cylinder"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0