Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Parental feedback on school opening

పాఠశాలల ప్రారంభంపై తలిదండ్రుల అభిప్రాయం
Parental feedback on school opening

   సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరవాలా వద్దా అంటే 33 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే సరే అంటున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్‌పై లోకల్ సర్కిల్స్ అనే ఏజెన్సీ ఓ సర్వే నిర్వహిస్తే తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా వైరస్ భయాలు, స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంలో సమస్యలు ఇంట్లోని వృద్ధులకు సమస్యల్ని తీసుకొస్తాయని స్కూళ్ల రీఓపెనింగ్‌ను వ్యతిరేకించే మెజార్టీ తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల చదువులో ఆటంకం కలగకూడదని ఇప్పటికే పలు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిరవ్హిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొదట 10 నుంచి 12 తరగతులు, ఆ తర్వాత 15 రోజులకు 6 నుంచి 9 తరగతుల్ని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందన్న వార్తలొస్తున్నాయి.
లోకల్ సర్కిల్స్ అనే ఏజెన్సీ సర్వే
లోకల్ సర్కిల్స్ సర్వేలో భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 25,000 మంది తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే స్కూళ్లు తెరిచేందుకు సరేనన్నారు. 58 శాతం మంది వద్దని అభిప్రాయ పడ్డారు. స్కూళ్లు తెరవడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా వివరించారు. ప్రస్తుతం కరోనా వైరస్ భయాలున్నాయని, రిస్కు తీసుకోమని 13 శాతం మంది చెబితే, పిల్లల్ని స్కూలుకు పంపిస్తే ఇంట్లో ఉన్న వృద్ధులకు రిస్కు ఉంటుందని 1 శాతం మంది వివరించారు. ఇక స్కూల్‌లో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యం కాదని 9 శాతం మంది చెప్పగా, స్కూళ్లు తెరిస్తే వైరస్ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుందని 5 శాతం మంది అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం ఉత్తమమని 2 శాతం మంది చెప్పారు.

భారతదేశంలో కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ ప్రకారం పిల్లలు హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. అమెరికాలో, ఇజ్రాయెల్‌లో స్కూళ్లు తెరిస్తే వందలాది మంది విద్యార్థులు, టీచర్లు వైరస్ బారిన పడ్డారు. కెన్యాలో ఈ ఏడాదంతా స్కూళ్లు తెరవట్లేదు. ఒకవేళ భారతదేశంలో స్కూళ్లు తెరిచినా పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరని అర్థమవుతోంది. అయితే గ్రామాల్లోని స్కూళ్లు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అందించే పరిస్థితి ఉండదు. అందుకే ప్రభుత్వమే రేడియో, టెలివిజన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసుల్ని అందిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Parental feedback on school opening"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0