Look up your name in Google search
GOOGLE సెర్చ్‌లో మీ పేరు చూసుకోండిలా
GOOGLE సెర్చ్‌లో మీ పేరు కనిపించాలనుకుంటున్నారా? మీరు ఇతర వ్యక్తుల గురించి ఎలాగైతే సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారో... అలాగే మీ గురించి కూడా ఇతరులు కూడా సెర్చ్ చేసి తెలుసుకునే అవకాశాన్ని GOOGLE సంస్థ అందిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక సేవను ప్రారంభించింది. భారతీయ వినియోగదారుల కోసం స్పెషల్ పీపుల్ కార్డులను ఈ లెజండరీ టెక్ కంపెనీ విడుదల చేసింది. దీని సహాయంతో భారత్ కు చెందిన వినియోగదారులు GOOGLE శోధనలో వర్చువల్ విజిటింగ్ కార్డులను సృష్టించుకునే సదుపాయాన్ని పొందుతారు.
GOOGLE ఖాతా ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ పీపుల్ కార్డ్‌ను సృష్టించుకునే వీలుంటుంది. ఈ సేవను GOOGLE నాలెడ్జ్ గ్రాఫ్ ఉపయోగించి యూజర్ ఇచ్చిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
దీని కోసం వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి దర్యాప్తు తర్వాతనే పీపుల్ కార్డును జారీ చేస్తారు. ఈ పీపుల్ కార్డును మనకు తోచినప్పుడు తీసివేసేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది.
కార్డు తయారీకి ఏం సమాచారం అందించాలి?
పీపుల్స్ కార్డు తయారు చేయడానికి వినియెగదారులు తమ ఫొటో, వ్యాపారం, నివాసం యొక్క వివరాలను అందించాల్సి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్నపక్షంలో ఈ కార్డులో వారి విద్య, పరిచయాలు, గ్రామం, సోషల్ మీడియా ప్రొఫైల్స్ వంటి సమాచారాన్ని కూడా జతచేయవచ్చు. తమ కార్డుపై వినియోగదారుడు పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. మనం కోరుకున్నప్పుడల్లా మన సమాచారాన్ని చెరిపివేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.
పీపుల్ కార్డ్ సృష్టించే విధానం ఏమిటి?
- GOOGLE పీపుల్ కార్డ్ తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా దీన్ని తయారు చేసుకోవచ్చు.
- మొదట మీరు మీ GOOGLE ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- తరువాత, వినియోగదారు తన పేరును GOOGLEలో శోధించాలి లేదా 'నన్ను శోధనకు జోడించు' అని టైప్ చేయాలి.
- కార్డుకు కావలసిన ఫొటోను జోడించాలి.
- మీరు మీ గురించి వివరాలను కూడా వ్రాయవచ్చు.
- మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఈ-మెయిల్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని ఉంచి సేవ్ చేసిన వెంటనే మీ కార్డ్ తయారవుతుంది.
0 Response to "Look up your name in Google search"
Post a Comment