Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Account: Rs 20 lakh insurance is free if you open this account with SBI

SBI Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.20 లక్షల ఇన్స్యూరెన్స్ ఉచితం
SBI Account: Rs 20 lakh insurance is free if you open this account with SBI


  • 1. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తారా? కంపెనీ నుంచి సాలరీ అకౌంట్ ఉందా? సాధారణంగా ఉద్యోగంలో చేరినవారికి కంపెనీ సాలరీ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తుంటుంది. సాలరీ అకౌంట్స్‌కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని బ్యాంకులూ సాలరీ అకౌంట్స్‌ని ఇస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా సాలరీ అకౌంట్‌ని అందిస్తోంది
  • 2. ఈ అకౌంట్‌కు 'కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ' అని పేరు పెట్టింది ఎస్‌బీఐ. ఈ అకౌంట్ సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం పేర్లతో నాలుగు వేరియంట్స్‌లో ఉంటుంది. ఉద్యోగికి వచ్చే వేతనాన్ని బట్టి ఈ నాలుగు అకౌంట్లలో ఒకటి వర్తిస్తుంది. గ్రాస్ మంత్లీ ఇన్‌కమ్ అంటే... బేసిక్ సాలరీతో పాటు అలవెన్సులు అన్నీ కలిపి ఎంత జీతం వస్తుందో దాన్ని బట్టి అకౌంట్ తీసుకోవచ్చు
  • 3. రూ.1,00,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ప్లాటినం, రూ.50,000 నుంచి రూ.1,00,000 ఆదాయం ఉన్నవారికి డైమండ్, రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఆదాయం ఉన్నవారికి గోల్డ్, రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఆదాయం ఉన్నవారికి సిల్వర్ అకౌంట్ కేటాయిస్తుంది SBI
  • 4. ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా ఉచితంగా అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అకౌంట్‌తో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కూడా వస్తుంది. రూ.20 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ (డెత్), రూ.30 లక్షల వరకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ (డెత్) కాంప్లిమెంటరీగా లభిస్తుంది
  • 5. పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్‌ లోన్స్ తీసుకుంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉంటాయి. లాకర్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. ఎక్కువ వడ్డీ పొందేందుకు ఆటో స్వీప్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సాలరీ అకౌంట్‌తో డీమ్యాట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ కూడా వస్తుంది. డ్రాఫ్ట్స్, మల్టీ సిటీ చెక్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉచితంగా లభిస్తాయి.
  • 6. ఆన్‌లైన్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలు కూడా ఉచితం. అంతేకాదు... కొందరు కస్టమర్లకు రెండు నెలల వేతనాన్ని ఓవర్ డ్రాఫ్ట్‌గా తీసుకోవచ్చు. ఎస్‌బీఐ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మీ లావాదేవీలపై పాయింట్స్ పొందొచ్చు. దాంతో పాటు డెబిట్ కార్డులు, యోనో యాప్‌లో రెగ్యులర్‌గా ఆఫర్స్ ఉంటాయి.
  • 7. మీరు ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మరో ఉద్యోగానికి మారినా ఆ అకౌంట్ కొనసాగించొచ్చు. ఇందుకోసం మీరు మీ కొత్త కంపెనీలో ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీ కొత్త కంపెనీ యాజమాన్యం బ్యాంక్ బ్రాంచ్‌కు సమాచారాన్ని పంపి వివరాలను అప్‌డేట్ చేయిస్తుంది.
  • 8.ఒకవేళ మీ అకౌంట్‌లో వరుసగా మూడు నెలలు జీతం పడకపోతే సాలరీ అకౌంట్ ద్వారా లభించే బెనిఫిట్స్ కోల్పోతారు. సాలరీ అకౌంట్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మారిపోతుంది. ఆ తర్వాత సేవింగ్స్ అకౌంట్‌కు ఉండే ఛార్జీలన్నీ వర్తిస్తాయి.
  • 9. ఒకవేళ మీకు ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ కావాలంటే మీ కంపెనీ ద్వారానే బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఒక సంస్థ నుంచి కనీసం 25 మంది ఉద్యోగులు ఉంటేనే సాలరీ అకౌంట్ అందిస్తుంది SBI

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Account: Rs 20 lakh insurance is free if you open this account with SBI"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0