Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Russian Prime Minister Putin has received the corona vaccine

కరోనా వాక్సిన్ వచ్చేసింది రష్యా ప్రధాని పుతిన్
Russian Prime Minister Putin has received the corona vaccine

కరోనా వాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఆ కరోనా టీకా రానే వచ్చింది. ప్రపంచంలో తొలి కరోనా వాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకునట్లు వెల్లడించారు. తన కూతురికి కూడా వాక్సిన్ షాట్ ఇచ్చారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచంలో ఇదే తొలి కరోనా వాక్సిన్ అని ఆయన పేర్కొన్నారు.

వాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పుతిన్.

యావత్ ప్రపంచానికి ఇది ఎంతో కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. త్వరలోనే కరోనా వాక్సిన్‌ను ఉత్పత్తిని వేగవంతం చేసి.. ప్రపంచమంతటికీ సరఫరా చేస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు విడుదల చేసిన వాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జూన్ 18న ఈ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 38 మంది వాలంటీర్లపై ఔషధ ప్రయోగాలు చేశారు. ఫస్ట్ బ్యాచ్ వాలంటీర్లు జులై 15న డిశ్చార్జి అయ్యారు. సెకండ్ బ్యాచ్ వాలంటీర్లు జులై 20న డిశ్చార్జి అయ్యారు. వీరందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరిగింది.తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వనున్నారు. ఈ టీకాలను రెండు చోట్ల తయారు చేయనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కో వెల్లడించారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, బిన్నోఫార్మా అనే కంపెనీల్లో కరోనా వాక్సిన్‌లను తయారు చేయనున్నారని తెలిపారు. ఈ వాక్సిన్‌పై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, దేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) చూసుకుంటుందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా వాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. కరోనాను తరిమికొట్టేందుకు ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం.. ఇందులో నాలుగు వాక్సిన్‌లు చివరి దశ ఉన్నాయి. ఆస్ట్రాజెనికా, మోడెర్నా కంపెనీలు అభివృద్ధి చేసిన ఫేజ్-3 హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించున్నారు. తుది దశ విజయవంతమైతే వీటిని కూడా విడుదల చేయనున్నారు.
.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Russian Prime Minister Putin has received the corona vaccine"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0