Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Many central scales can be achieved by writing a single test .. Here is the way ..

ఒకే పరీక్ష రాసి ఎన్నో కేంద్ర కొలువులు సాధించొచ్చు .. మార్గం ఇదిగో ..
Many central scales can be achieved by writing a single test .. Here is the way ..

ఫలితంగా ప్రస్తుతమున్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ వంటి పలు సంస్థలు నిర్వహిస్తున్న గ్రూప్‌-బి, సి(నాన్‌- టెక్నికల్‌) నియామక పరీక్షలన్నింటినీ.. ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చినట్లయింది. దీంతో కోట్ల మంది ఉద్యోగార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్‌ఆర్‌ఏ విధి విధానాలు, సెట్‌తో కలిగే ప్రయోజనాలు, సిలబస్, పరీక్ష స్వరూపం గురించి తెలుసుకుందాం..

ప్రస్తుతం.. పదో తరగతి నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ వరకూ.. నిరుద్యోగ యువత సర్కారీ కొలువులను ఆశిస్తూ.. పదుల సంఖ్యలో పరీక్షలకు హాజరుకావాల్సి వస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే..
ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షలు రాయాలి. బ్యాంకు జాబ్‌ కోసం ఐబీపీఎస్‌ పరీక్షలకు హాజరవ్వాలి. ఏటా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టే రైల్వే పరీక్షలకు హాజరవ్వాలంటే.. ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాల్సిందే! ఇలా అనేక పరీక్షలు రాసేందుకు నిరుద్యోగులు అనేక వ్యయప్రయాసలు భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితికి స్వస్తి పలికే ఉద్దేశంతో.. ఉమ్మడిగా ఒకే పరీక్ష ఎన్‌ఆర్‌ఏ సెట్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఏ సెట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ వంటి నియామకాలు జరిపినా.. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) కూడా ఎన్‌ఆర్‌ఏ సెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రైవేటు సంస్థలు కూడా ఎన్‌ఆర్‌ఏ సెట్‌ ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించే వీలుంది.
ఎన్‌ఆర్‌ఏ విధి విధానాలు..
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి(నాన్‌-టెక్నికల్‌) పోస్ట్‌లకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసేందుకు నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ.. జాతీయ స్థాయిలో కామŒన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీఈటీ) నిర్వహించనుంది. ముందుగా ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌లను ఎన్‌ఆర్‌ఏ పరిధిలోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో మరికొన్ని సంస్థలను కూడా ఎన్‌ఆర్‌ఏ గొడుగు కిందకు తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం రెల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులతో ఎన్‌ఆర్‌ఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సెట్‌.. స్కోర్‌
ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు ఫలితంగా.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ పర్సనల్‌ (ఐబీపీఎస్‌) వంటి సంస్థలు.. ఇకపై వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఎన్‌ఆర్‌ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీఈటీ-సెట్‌) నిర్వహిస్తుంది. ఇందులో పొందిన స్కోర్‌కు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విషయంలో ఎలాంటి పరిమితి లేదు. నిర్దేశిత గరిష్ట వయో పరిమితి వరకు పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరు కావచ్చు. ఫలితంగా ఒకసారి పరీక్షలో తక్కువ స్కోర్‌ పొందినా.. మరోసారి కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు హాజరై మంచి స్కోర్‌తో ఆయా శాఖల్లోని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వ్యయ, ప్రయాసల నుంచి ఉపశమనం..
ఎన్‌ఆర్‌ఏ నిర్వహించే కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ద్వారా కోట్ల మంది నిరుద్యోగులకు అనేక వ్యయ ప్రయాసల నుంచి ఉపశమనం లభించనుంది. ఇంతకాలం ఆయా కొలువుల కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవడం, దరఖాస్తు ఫీజు, సుదూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాలకు ప్రయాణం.. ఇవన్నీ ఎంతో ఖర్చుతో కూడుకునేది. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు ఫలితంగా కేంద్ర ఉద్యోగాల కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా ఉద్యోగార్థులకు ఎంతో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
మూడు స్థాయిల్లో సెట్‌..
ఎస్‌ఎస్‌సీ.. పదో తరగతి అర్హతగా మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, కానిస్టేబుల్‌-జనరల్‌ డ్యూటీ పోస్ట్‌లకు; ఇంటర్మీడియెట్‌ అర్హతగా హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామ్‌ పేరుతో క్లరికర్‌ కేడర్‌ పోస్ట్‌లకు; బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామ్‌ పేరుతో గ్రూప్‌-బి పోస్ట్‌లకు పరీక్షలను నిర్వహిస్తోంది. ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీలు కూడా ఇదే విధంగా పరీక్షలు జరుపుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్‌ఆర్‌ఏ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కూడా మూడు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ఆయా ఉద్యోగాల స్థాయి, అవసరమైన నైపుణ్యాలను పరిశీలించేందుకు మలి దశలో టైర్‌-2, టైర్‌-3 ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు.
ప్రిలిమినరీగానే..
ఎన్‌ఆర్‌ఏ సెట్‌ ఆయా సంస్థలు చేపట్టే నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్షగానే నిలిచే అవకాశం ఉంది. తర్వాత దశలో సదరు నియామక సంస్థలు నిర్వహించే టైర్‌-2, టైర్‌-3 పరీక్షలకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐబీపీఎస్‌ పీఓ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వూ.. ఇలా మూడు దశల్లో నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఎన్‌ఆర్‌ఏ సెట్‌లో స్కోర్‌ సాధించినా.. తర్వాత దశలో నిర్వహించే మెయిన్, ఇంటర్వూలకు ప్రత్యేకంగా హాజరు కావాల్సిందే. దీనిపైనే ఉద్యోగార్థుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. సెట్‌లో మంచి స్కోర్‌ సాధించినా.. మలిదశలో ఆయా సంస్థలు వేర్వేరుగా నియామక ప్రక్రియలు చేపట్టే విధానం కొనసాగితే.. ఈ సెట్‌ వల్ల ఆశించినంత ఫలితం ఉండదనే వాదన వినిపిస్తోంది.
మరి వాటి సంగతి?!
ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, ఆర్‌బీఐలు.. ఐబీపీఎస్‌తో సంబంధం లేకుండా సొంతంగా నియామకాలు చేపడుతున్నాయి. వీటితోపాటు త్రివిధ దళాలు, పారా మిలటరీ, బీఎస్‌ఎఫ్‌ వంటి సంస్థల విషయంలోనూ స్పష్టత ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు, సాంకేతిక అర్హతలు అవసరమైన త్రివిధ దళాలు, ఇతర ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ను మినహాయించినా.. ఎస్‌బీఐ, ఆర్‌బీఐలు.. ఎన్‌ఆర్‌ఏ సెట్‌ స్కోర్‌ ప్రాతిపదికగా నియామకాలు జరిపేలా చూడాలంటున్నారు. ఎస్‌బీఐ నిర్వహించే క్లర్క్స్, పీఓ పోస్ట్‌లకు ఏటా లక్షల మంది అభ్యర్థులు సిద్ధమవుతుంటారు. ఆర్‌బీఐ పోస్టులకు కూడా ఎక్కువ మందే దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి ఎస్‌బీఐ, ఆర్‌బీఐలను కూడా ఎన్‌ఆర్‌ఏ సెట్‌ స్కోర్‌ ప్రాతిపదికగా నియామకాలు చేపట్టేలా చూస్తే.. ఒకటే పరీక్షతో మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
సిలబస్‌.. పరీక్ష స్వరూపం
ఎన్‌ఆర్‌ఏ సెట్‌ 12 భాషల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఎన్‌ఆర్‌ఏ సెట్‌ను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించనున్నారు. కాబట్టి ఉద్యోగార్థులు ఆన్‌లైన్‌ టూల్స్‌పై అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది. ఎన్‌ఆర్‌ఏ సెట్‌ పరీక్ష స్వరూపం.. సిలబస్‌.. పరీక్ష ∙సమయంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఆయా నియామక పరీక్షల సబ్జెక్ట్‌ నిపుణులు మాత్రం.. ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌లు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షల మాదిరిగానే ఎన్‌ఆర్‌ఏ సెట్‌ ఉంటుందని పేర్కొంటున్నారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాలతో గరిష్టంగా వంద మార్కులకు సెట్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాల ఆశావహులు ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీల సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించడం మేలని సూచిస్తున్నారు.
త్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌:
మొత్తం మీద గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎన్‌ఆర్‌ఏకు అంకురార్పణ జరిగినా.. తొలి టెస్ట్‌ వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం ఉంది. ఎన్‌ఆర్‌ఏ వెబ్‌సైట్‌ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తే.. అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సమాచారం లభించి, ఎన్‌ఆర్‌ఏ సెట్‌పై మరింత స్పష్టత వస్తుంది.
ఎన్‌ఆర్‌ఏ సెట్‌.. ముఖ్యాంశాలు

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్‌ఆర్‌ఏ సెట్‌.
  • ఏటా రెండు సార్లు కామన్‌ ఎలిజిబిలీ టెస్ట్‌ నిర్వహణ.
  • స్కోర్‌ కాల పరిమితి మూడేళ్లు.
  • గరిష్ట వయో పరిమితిలోపు ఎన్ని సార్లయినా రాసుకోవచ్చు.
  • కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఎన్‌ఆర్‌ఏ సెట్‌. ఊ డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరుగా సెట్‌.
  • పరీక్షలకు కామన్‌ సిలబస్‌.
  • ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష.
  • ఎన్‌ఆర్‌ఏ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సదుపాయం.
  • 12 భాషల్లో పరీక్ష నిర్వహణ.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Many central scales can be achieved by writing a single test .. Here is the way .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0