Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No more cashless medical services for employees

ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్య సేవలు.

మెడికల్ రీయింబర్స్ మెంట్  సౌకర్యం నిలిపివేత.
నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆదేశాలు.
ఆరోగ్యశ్రీ  ట్రస్టు సీఈవో ఉత్తర్వులు.


  • ఉద్యోగులకు పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈనెల 1 నుంచి మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని నిలిపివేసింది.
  • డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు నెట్ వర్క్  ఆసుపత్రులన్నీ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈ హెచ్ఎస్) కింద నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచిపూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.
  • ఈ విషయమై కొన్ని నెట్ వర్క్ ఆసుపత్రులు అభ్యంతరం చెప్తుండటంతో నగదు రహిత వైద్యసేవలుఅందుబాటులోకి రాలేదు.
  • ఇటీవల ప్రభుత్వం ఈ హెచ్ ఎస్ నెలవారీ ప్రీమియంను కూడా ఒకటిన్నర రెట్లు పెంచింది.
  • గతంలో రూ.90 చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం రూ. 225, రూ 120 చెల్లించే వారు రూ 300 నెలవారీ ప్రీమియం కడుతున్నారు.
  • ఈ హెచ్ ఎస్ సేవలకు నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు చెల్లించే విధంగా ప్రతినెలా 5లోపు ఖజానాశాఖ నుంచి ఆరోగ్యం ట్రస్టుకు నిధులు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • ఈ నేపథ్యంలో ఉద్యోగులకు, పెననర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది
  • ఉచిత సేవలు అందించకపోతే చర్యలు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఉచిత వైద్య సేవలు అందించని నెట్ వర్క్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్టు హెల్త్ కేర్ సీఈవో హెచ్చరించారు.
  • ఉద్యోగుల నుంచి వైద్య సేవలకు డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రులకు వారు తీసుకున్న మొత్తానికి  10 రెట్లు జరిమానా విధిస్తామని సీఈవో తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
  • ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పథకాలను మూడు నెలలపాటు ఆయా ఆసుపత్రులకు వర్తించకుండా సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No more cashless medical services for employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0