Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI key decision on moratorium.

మారటోరియం పై ఆర్బీఐ కీలక నిర్ణయం.
RBI key decision on moratorium.

కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న వేతన జీవులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. లాక్‌డౌన్‌ కాలంలో పనులు లేకపోవడంతో అన్ని రకాల లోన్స్ పై మొదట మూడు నెలలు మారటోరియం విధించింది.. ఆ తర్వాత లాక్‌డౌన్ కొనసాగడం.. ఆ తర్వాత లాక్‌డౌన్ ముగిసి.. అన్‌లాక్‌లోకి వెళ్లినా మారటోరియాన్ని మాత్రం పొడిగిస్తూ వచ్చింది. అయితే ఈ ఆగష్టుతో మారటోరియం గడువు పూర్తికానుంది.. దీంతో ఆర్‌బీఐ ఈసారి కార్పొరేటర్లకు, ఇతర వ్యక్తులకు వన్ టైమ్ రుణ పునర్ వ్యవస్థీకరణ బ్యాంకింగ్‌కు అనుమతి ఇచ్చింది. గత ఏడాది జూన్ 7న ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ పునర్ వ్యవస్థీరణ జరపాల్పి ఉంటుందని స్పష్టం చేసింది ఆర్బీఐ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ మేరకు సూచనలు చేశారు.

ఇక, ఆర్బీఐ రుణ పునర్ వ్యవస్థీకరణకు బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు.. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్పణం డిమాండ్ పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ వివేకవంతమైన నిర్ణయం తీసుకుందంటున్నారు. మరోవైపు... మారటోరియంను రిటైల్‌ కస్టమర్ల కన్నా కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువగా ఉపయోగించుకున్నాయని, ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న కార్పొరేట్లు కూడా స్వప్రయోజన కాంక్షతో దానిని ఉపయోగించుకుంటూ ఉండడంతో.. మారటోరియంను మరింతగా పొడిగించాల్సిన అవసరం లేదంటున్నారు కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఆర్బీఐ మొత్తానికి మరోసారి మారటోరియం జోలికి పోకుండా రుణాల పునర్ వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్బీఐ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "RBI key decision on moratorium."

  1. It will be better if it is extended for three more months.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0