Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sweet News for students in AP .... 1st to 8th graders have no exams next year

ఏపీ లో విద్యార్థులకు తీపి కబురు.... 1నుండి 8వ తరగతుల  వారికి వచ్చే ఏడాది పరీక్షలు లేవు.
Sweet talk for students in AP .... 1st to 8th graders have no exams next year


  • ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
  • అంటే, వాస్తవ షెడ్యూల్ కంటే మూడు నెలలు ఆలస్యంగా క్లాసులు ప్రారంభం కానున్నాయి.
  • ఈ క్రమంలో విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • సుమారు 30 శాతం నుంచి 40 శాతం మేర సిలబస్ తగ్గించే అవకాశం ఉంది.
  • విద్యా సంవత్సరం ఎంత మిగిలి ఉంది? ఎన్ని రోజులు స్కూళ్లు జరుగుతాయి?, ఏ విధంగా విద్యా విధానం ఉంటుందనే అంశాన్ని బట్టి ఎంతమేర సిలబస్ తగ్గించాలనేది నిర్ణయిస్తారు.
  • 'మనకు ఒక విద్యాసంవత్సరంలో 222 రోజులుంటే, అందులో 90 రోజులు ఇప్పటికీ నష్టపోయాం.' అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
  • అయితే, పరీక్షల విధానంలో కానీ, ప్రశ్నాపత్రం విధానంలో కానీ మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
  • సిలబసకు సంబంధించిన వర్క్ బుక్ను ప్రభుత్వ పాఠశాలలకు అందించాం.
  • విద్యార్థుల కోసం విద్యా వారధి వాహనాలు కూడా ఏర్పాటు చేశాం.
  •  అయితే, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులు జరగడం లేదు.
  • దీన్ని బట్టి ఒక ఏడాది సిలబస్ ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే అటు విద్యార్థులకు, ఇటు టీచర్లకు కూడా కష్టమే.
  • కాబట్టి సిలబస్ తగ్గించాలని నిర్ణయించాం.' అని ఆదిమూలపు సురేష్ గారు అన్నారు.
  • అయితే, సిలబస్లో దేన్ని దేన్ని తీసేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
  • SCERT అధికారులు దీనిపై సమగ్రంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
  • స్కూళ్లు రీ ఓపెన్ అయిన తర్వాత దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
  • ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉండవని, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేస్తామని చెప్పారు.
  • అయితే, 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయి.
  • స్కూళ్లలో ఎలాంటి విధానాలు పాటించాలనే దానిపై ప్రభుత్వం ఒక పద్ధతి సూచిస్తుంది.
  • ప్రతి 15 రోజులకు ఓసారి స్కూళ్లు తమ విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించి, వారి హెల్ట్ రికార్డులు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
  • అలాగే, ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాల్సి ఉంటుంది.
  • ఆ రోజు క్రీడా, వినోద, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలు చేపట్టాలి.
  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులు బియ్యం ఇస్తారు.
  • స్కూళ్లలో ఉదయం పూట నిర్వహించే 'అసెంబ్లీని ఇకపై విద్యార్థులు తమ తమ క్లాసుల్లోనే నిర్వహిస్తారు.®️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sweet News for students in AP .... 1st to 8th graders have no exams next year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0