Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Using the Telegram app? Take Care on this

టెలీ గ్రామ్ యాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగర్త.
Using the Telegram app? Take Care on this

 ఈ మధ్య కాలంలో మోసాలు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎంత తెలివిమంతులైనా సరే ఎవరో ఒకరి చేతిలో ఏదో ఒక సందర్భంలో మోసపోతూ ఉంటారు. మోసగాళ్లు సైతం ప్రజలను మోసం చేయటానికి కొత్తకొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. ఈ విధంగా కూడా మోసం చేయవచ్చా...? అని మోసపోయిన వాళ్లే ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. టెక్నాలజీ పెరగడంతో సోషల్ మీడియా యాప్స్ ను వినియోగించి మోసాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

తాజాగా కొత్త తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. టెలీగ్రామ్ యాప్ ద్వారా మోసగాళ్లు మోసాలు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు ఇందుకోసం మతాన్ని వాడుకుంటున్నారు. హిందూ మతం పేరుతో గ్రూపులను క్రియేట్ చేసి ప్రముఖ ఈకామర్స్ సంస్థ వెబ్ సైట్ నుంచి కావాల్సిన వస్తువును తక్కువ ధరకే అందిస్తామని...

5000 రూపాయలు చెల్లిస్తే నచ్చిన వస్తువు పొందవచ్చని... వేల రూపాయల వస్తువును ఆర్డర్ చేసినట్టు లింక్ లను కూడా గ్రూప్ లో ఉండే సభ్యులకు పెడుతున్నారు.

50,000 అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వస్తువులను 5,000 రూపాయలు చెల్లిస్తే పొందవచ్చని ఆశ చూపుతున్నారు. ఎవరైనా ఇంత తక్కువ మొత్తానికి వస్తువు ఇవ్వడం సాధ్యమవుతుందా...? అని ప్రశ్నిస్తే మన గ్రూప్ లో సభ్యులకు స్పెషల్ ఆఫర్ లో భాగంగా ఇస్తున్నామని చెబుతున్నారు. ఎవరైతే వారికి 5,000 చెల్లిస్తారో వాళ్లను ఆ తరువాత టెలీగ్రాం గ్రూప్ నుంచి తొలగిస్తున్నారు. ఈ విధంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపుతున్నారు.

5,000 రూపాయలు మోసపోయామని ఎవరూ కేసులు పెట్టరు. కేసులు పెట్టినా అలాంటి ఫిర్యాదులను పట్టించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తున్నామని... లాటరీ పొందేలా చేస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. అవతలి వ్యక్తుల ఆశను అడ్డుపెట్టుకుని మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రజలు ఎవరైనా ఆశ చూపి డబ్బులు డిపాజిట్ చేయమంటే వాళ్లు మోసగాళ్లని గుర్తించి జాగ్రత్తపడాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Using the Telegram app? Take Care on this"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0