Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

When is the corona gone ... the World Health Organization, to put it bluntly.

కరోనా ఎప్పుడు పోతుంది ... సూటిగా స్పష్టంగా చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.
When is the corona gone ... the World Health Organization, to put it bluntly.

COVID 19 WHO: అప్పుడెప్పుడో ఇండియాలో కరోనా వైరస్... జూన్‌లో పీక్ స్టేజ్‌కి వెళ్తుందనీ... ఆ తర్వాత తగ్గిపోతుందనుకున్నారు చాలా మంది. కానీ... వినాయక చవితి వచ్చేసినా... కరోనా మాత్రం పోలేదు. పైగా... ఇప్పుడే మన దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అఫ్‌కోర్స్... రికవరీలు కూడా అలాగే ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా కరోనా వదిలితే తప్ప మనం ఫ్రీ అవ్వలేం. రోజూ... ఆ రోజుల్ని తలచుకుంటూ ఇలా ఎన్నాళ్లు ఉండగలం. అందుకే... ప్రపంచ ఆరోగ్య సంస్థను చాలా మంది అడిగారు. "ఎప్పుడు పోతుంది ఈ కరోనా" అని... దానికి WHO చీఫ్ టెడ్రోస్... కాసేపు మౌనంగా ఉండి... ఓ సమాధానం చెప్పారు. టెడ్రోస్ అంచనా ప్రకారం... వచ్చే రెండేళ్లలోనే కరోనా వైరస్ సమస్యలు పూర్తిగా పోతాయంటున్నారు. కోవిడ్ కంటే భయంకరమైన స్పానిష్ ఫ్లూ... 1918లో వచ్చి... రెండేళ్లలో పోయింది. అప్పట్లో ఇంతలా వైద్యం అభివృద్ధి చెందలేదు. అయినా రెండేళ్లలో పోయింది కాబట్టి... కరోనా కూడా... ఎంత వేగంగా వ్యాపించిందే... అంతే వేగంగా... రెండేళ్లలోనే పోతుందంటున్నారు.


టెడ్రోస్ చెప్పింది విన్నాక... అది శుభవార్తలాగా మనకు అనిపించదు. ఎందుకంటే... ఇంకో రెండేళ్లు కరోనా వైరస్ ఉందనే అర్థం కూడా ఆ మాటల్లో ఉంది. ఇప్పటికే ఉద్యోగాలు పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. వైరస్ వల్ల కోట్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఇండియా తీవ్రంగా నష్టపోతోంది. కరోనా మరణాలు కూడా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఇలాంటి రాకాసి వైరస్ ఎంత త్వరగా పోతే అంత మంచిదని మనం అనుకుంటున్నాం. మనలాగే ఆలోచిస్తూనే... WHO... ప్రపంచ దేశాల రిపోర్టుల్నీ, వ్యాక్సిన్ల తయారీ అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని ఈ ప్రకటన చేసింది.

ప్రస్తుతం నిన్న ప్రపంచవ్యాప్తంగా... 246443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2.30 కోట్లు దాటింది. నిన్న 5780 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 8లక్షలు దాటి... 802318కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు... 1.56 కోట్లు దాటాయి. అందువల్ల యాక్టివ్ కేసులు 66.05 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో 65.44 లక్షలకు పైగా కేసుల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉంది. 61849 మందికి కరోనా తీవ్రంగా ఉంది. కరోనా క్లోజింగ్ కేసుల్లో మరణాల రేటు 5 శాతంగా ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "When is the corona gone ... the World Health Organization, to put it bluntly."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0