Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Jobs 2020: 535 jobs in Punjab National Bank

Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు
Bank Jobs 2020: 535 jobs in Punjab National Bank

PNB Recruitment 2020 బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారి కోసం మరో నోటిఫికేషన్ విడుదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 535 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందా? అయితే మీకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. 535 పోస్టుల్ని ప్రకటించింది. బ్యాంకు అవసరాన్ని బట్టి నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వేర్వేరు విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 29 చివరి తేదీ. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.pnbindia.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

గమనిక:. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 29 తోనే ముగిసినప్పటికీ తాజాగా ఆ గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించారు.
మొత్తం ఖాళీలు- 535
మేనేజర్ (క్రెడిట్)- 200
మేనేజర్ (ట్రెజరీ)- 30
మేనేజర్ (లా)- 25
మేనేజర్ (ఆర్కిటెక్ట్)- 2
మేనేజర్ (సివిల్)- 8
మేనేజర్ (ఎకనమిక్)- 10
మేనేజర్ (హెచ్ఆర్)- 10
సీనియర్ మేనేజర్ (రిస్క్)- 40
సీనియర్ మేనేజర్ (క్రెడిట్)- 50

గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 08.09.2020
దరఖాస్తుకు చివరి తేదీ- 29.09.2020 
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ఎగ్జామ్- అక్టోబర్ లేదా నవంబర్
వయస్సు- మేనేజర్ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 25 నుంచి 37 ఏళ్లు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Jobs 2020: 535 jobs in Punjab National Bank"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0