Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Examinations are taking place

పరీక్ష లు పెడుతున్నారు..!
Examinations are taking place


  • పుస్తకాలు కొనాలంటూ కార్పొరేట్‌ పాఠశాలల ఫీ‘జులుం’
  • లేదంటే ఆన్‌లైన్‌ పరీక్షలకు అనుమతించమని సందేశం
  • పరీక్షల నిర్వహణకు అనుమతి లేదంటున్న అధికారులు

తణుకు పట్టణానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక కార్పొరేట్‌ విద్యా సంస్థలో 9వ తరగతి చదువుతున్నారు. ఇటీవల పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వచ్చే వారం నుంచి ఆన్‌లైన్‌లో సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం.. పుస్తకాలు తీసుకున్న వారికే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తాం. పుస్తకాలకు రూ.5,500 చెల్లించాలని సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతుల నిమిత్తం రూ.5 వేల నగదు కట్టించుకున్నారు

తాడేపల్లిగూడెంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతున్నారు. నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం విద్యార్థిని తండ్రి చరవాణికి మాటల సందేశం పంపింది. ‘ఈ రోజు నుంచి మీకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మీకు ఓ లింకు పంపిస్తాం. చరవాణి, కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి ఆన్‌లైన్‌లోనే పరీక్ష రాయాలి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ఫీజ్‌ చెల్లించని వారుంటే చెల్లించాలి. అలా చెల్లించిన వారికే లింక్‌ ఓపెన్‌ అవుతుంది’ అని ఉంది. ఇప్పటికే ఆ విద్యార్థిని ఆన్‌లైన్‌ తరగతులకు రూ.2 వేలు, పుస్తకాలకు రూ.7 వేలు చెల్లించింది.

కరోనా విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చింది. విద్యార్థులను పాఠశాలలకు దూరం చేసింది. ఇదే అదనుగా కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షల పేరుతో కొత్త తరహా వ్యాపారానికి తెరతీస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ఫీజులు వసూలు చేశారు. ప్రస్తుతం కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు పుస్తకాలు కొనుగోలు చేయాలని, పరీక్ష ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు చరవాణి ద్వారా తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మాత్రమే ప్రభుత్వం అనుమతించినా పుస్తకాలకు, పరీక్షలకు నగదు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యా శాఖాధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విలువైన విద్యా సంవత్సరం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ తరగతులకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందే జి కొన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థలు తరగతులు నిర్వహించాయి. ప్రస్తుతం కొందరు కొత్త తరహా వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు.. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని కార్పొరేట్‌, సెమీ కార్పొరేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులు విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి ఓ మెలిక కూడా పెట్టారు. పరీక్షలు రాయాలంటే ముందు పుస్తకాలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నారు. దానికి ఒక్కో పాఠశాల ఒక్కో రేటును నిర్ధ.రించింది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు ఫీజులు షరామామూలే. ప్రస్తుతం పుస్తకాలతో అవసరమే లేదని.. ఆన్‌లైన్‌ తరగతులే సరిగ్గా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితమవుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ..ఇదే అంశాన్ని డీఈవో సీవీ రేణుక దృష్టికి తీసుకెళ్లగా ఆన్‌లైన్‌ తరగతులకు మాత్రమే ప్రభుత్వం అనుమతించిందన్నారు. పరీక్షల నిర్వహణ, పుస్తకాలకు నగదు వసూళ్లు నిబంధనలకు విరుద్ధమన్నారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో పరిస్థితిపై తనిఖీ చేసి నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆన్‌లైన్‌తో అవస్థలు
ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కష్టాలు వచ్చిపడ్డాయి. ఆన్‌లైన్‌ తరగతులకు స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు తప్పనిసరి. పైగా ఇంటర్నెట్‌ ఛార్జీలు అదనం. అసలే లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో స్మార్ట్‌ ఫోన్‌ కొనడం చాలా కుటుంబాలకు భారంగా మారింది. తక్కువ వయసులోనే ఫోన్‌ వాడకం వల్ల త్వరగా చెడు వ్యాపకాల వైపు విద్యార్థుల దృష్టి మళ్లుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేవు. అక్కడ నెట్‌ సిగ్నల్‌ కూడా అందడం లేదు. దీంతో విద్యార్థులకు పాఠ్యాంశాలు సవ్యంగా బోధపడటం లేదు. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల ఆరోగ్యపరంగాను కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరాయంగా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ మానిటర్‌ను తదేకంగా 45 నిమిషాల కన్నా ఎక్కువ సమయం చూడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Examinations are taking place"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0