Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Directly into PhD with four-year degree: Chief Minister Jaganmohan Reddy

నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీలోకి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
Directly into PhD with four-year degree: Chief Minister Jaganmohan Reddy

అమరావతి: రాష్ట్రంలోని అన్ని కళాశాలలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తప్పనిసరిగా నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ) గుర్తింపు పొందాలని అధికారులను ఆదేశించారు. జాతీయ విద్యావిధానంపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ కళాశాలలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని.. కళాశాలల్లో ప్రమాణాలపై ఎన్‌వోపీలు ఖరారు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 


అన్ని కళాశాలల్లో తరచూ తనిఖీలు చేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ తనిఖీలకు 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా టీచర్‌ ట్రైనింగ్‌ కళాశాలలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలని.. అప్పటికీ మార్పు రాకపోతే ఆ కళాశాలలను మూసివేయాలని స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో అధునాతన అంశాలతో కోర్సులు రూపొందించాలని చెప్పారు. ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ.. మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉండాలని సూచించారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశానికి అర్హత కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటానమస్‌ కళాశాలల సంఖ్య పెరగాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Directly into PhD with four-year degree: Chief Minister Jaganmohan Reddy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0