Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news Nirmala Sitharaman .. Do you have a bank account?

శుభవార్త చెప్పిన నిర్మలా సీతారామన్ మీకు బ్యాంకు అకౌంట్ ఉందా ?ఐతే తక్కువ ఖర్చుతో ఇంటివద్దకే బ్యాంకులు.

రాబోయే రోజుల్లో, నగదును ఉపసంహరించుకోవడం లేదా జమ చేయడం వంటి ఇతర ఆర్థిక సేవలకు బ్యాంకుల దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. దీని కోసం బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి. అవును, మీరు విన్నది నిజం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి) ఈజ్ బ్యాంకింగ్ సంస్కరణల క్రింద.. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాయి. దీని కింద, వినియోగదారులు కాల్ సెంటర్లు, వెబ్ పోర్టల్స్ , మొబైల్ యాప్ ల ద్వారా ఇంటి వద్ద బ్యాంకు యొక్క ఆర్థిక సేవలను పొందవచ్చు. అక్టోబర్ 1 నుంచి పీఎస్‌బీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి.

ఈజీ ఆఫ్ బ్యాంకింగ్ సంస్కరణల సూచికపై బుధవారం జరిగిన వర్చువల్ అవార్డు కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు.

కాల్ సెంటర్లు, వెబ్ పోర్టల్స్ , మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినియోగదారులు తమ అభ్యర్థనలను ట్రాక్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ సేవలకు బ్యాంకుల తరపున బ్యాంకింగ్ ఏజెంట్లను నియమించనున్నారు. దేశంలోని 100 నగరాల నుండి ఈ సేవలు ప్రారంభం అవుతాయి. అయితే, ఈ సేవలను పొందడానికి వినియోగదారులు నామమాత్రపు ఛార్జీని మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఇప్పుడు కూడా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు మాత్రమే. అందులో ముఖ్యమైనవి.. చెక్-డిమాండ్ డ్రాఫ్ట్ , పే-ఆర్డర్ సేకరణ, కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు స్లిప్, ఖాతా స్టేట్‌మెంట్ కోసం దరఖాస్తు, వ్యక్తిగతేతర చెక్‌బుక్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ రశీదు డెలివరీ, టిడిఎస్-ఫారం -16 పంపిణీ మొదలైనవి ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news Nirmala Sitharaman .. Do you have a bank account?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0