Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ID Cards for teachers

ఉపాధ్యాయులకు ఐడీలు
ID Cards  for teachers


  • ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు
  • యూడైస్ కోడు తో పాటు ఇతర వివరాలు నమోదు


 రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత  పాఠశాలల్లోపనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఐడెంటిటీ కార్డులు సిద్ధంచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అన్నిపాఠశాలల ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఉపాధ్యాయులకు అందజేసే ఐడెంటిటీ కార్డులు ఒక్కొక్క
దాని కోసం రూ. 50 చెల్లించను న్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో లక్షా 1, 687 మంది ఉపాధ్యాయులు
విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటుగా కొత్తగా చేరిన  ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసంజిల్లాలవారీగా విద్యాశాఖాధికారులు,సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు అవసరమైన డేటాను సిద్ధంచేస్తున్నారు.
మరోవైపు ఇదే తరహాలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ అవసరమైన చర్యలు చేపడుతున్నా రు.రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 వేల 902మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు
ఫోటోలు, ఇతర వివరాలతో

  • ఉపాధ్యాయులకు అందజేసే గుర్తింపు కార్డుల్లో వారి ఫొటో, పేరు, హోదాతో పాటు పాఠశాల పేరు, యూడైస్ కోడ్,చిరునామా తదితర వివరాలు నమోదు చేయనున్నారు.
  • ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న తరహాలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ కార్డులను అందించనున్నారు.
  • తద్వారా నాడు- నేడు, ఇతర పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సులభంగా ఉంటుందని చెబుతున్నారు. 
  • అంతే కాకుండా పాఠశాలల తనిఖీల
  • సందర్భాల్లో గతంలో అనేక అవకత వకలను విద్యాశాఖ గుర్తించింది. 
  • పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకపోయినా.. హాజరైనట్లుగా నమోదు చేసి నట్లు తనిఖీల్లో వెల్లడయ్యాయి.
  • ఇకముందు ఇలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవని, అటెండెన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా
  • చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 
  • ఐడీ కార్డులకోసం ఇప్పటికే సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
  • ఒక్కో కార్డుకు రూ. 50 చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు లక్షా 1687 మందికి రూ. 50 లక్షల 84 వేల 350,ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 52 వేల 902మందికి రూ. 26 లక్షల 45 వేల వంద మొత్తాన్ని విడుదల చేశారు. 
  • కార్డులు జారీ చేసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాటిని ధరించి తీసుకురావాల్సి ఉంటుందని
  • అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ID Cards for teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0