Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

పెళ్లి వద్దని ఇంట్లో నుండి పారిపోయింది కలెక్టర్‌గా తిరిగొచ్చింది.
Inspiration

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తుంటే వద్దని పారిపోయింది. కట్ చేస్తే కలెక్టర్‌గా తిరిగి ఇంటికి వెళ్లింది. అంతేకాదు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
ఒక అమ్మాయి తన జీవితంలో వివాహం, కెరీర్.. ఏదో ఒకటి ఎంచుకోమని అడిగినప్పుడు.. కెరీర్‌కు ప్రాధాన్యమిస్తారు. అమ్మాయిలు పెరుగుతున్నారంటే ఇంటిలోని ప్రతి ఒక్కరూ ఆమె పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అయితే అమ్మాయి మాత్రం తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటుంది. మీరట్‌లో నివసించే సంజు రాణి వర్మ అచ్చం ఇలాంటిదే చేశారు. చదువును వదిలేసి పెండ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిళ్లకు తలొగ్గక.. తాను అనుకున్నది నిరూపించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. ఇప్పుడు కలెక్టరై స్వగ్రామానికి తిరిగి వచ్చి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
Inspiration

మీరట్ కు చెందిన 28 ఏళ్ల సంజు రాణి వర్మ తల్లి 2013 లో కన్నుమూసింది.
దాంతో చదువులను నిలిపివేసిన తండ్రి సంజు రాణికి పెండ్లి చేసేందుకు నిర్ణయించింది. అయితే పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు సరికదా కుటుంబసభ్యులను వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే డిగ్రీ పూర్తిచేసిన సంజు రాణి.. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చదివింది. అనంతరం యూపీఎస్సీ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాలలో ర్యాంకు సంపాదించి కలెక్టర్ అయింది. ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్తూ, ప్రైవేట్ ఉద్యోగం చేసింది. ఏడేండ్ల పాటు కష్టించి చదివి తాను అనుకున్నది సాధించింది.
బాలికల విద్యకు విలువ లేని కుటుంబంలో జన్మించిన సంజు రాణి అక్కకు ఇంటర్‌ పూర్తిచేయగానే వివాహం చేశారు. సంజు రాణి కూడా అక్క మాదిరిగా తల వంచుకుని తాళి కట్టించుకుని ఉంటే ఈ రోజు కలెక్టర్ అయ్యేది కాదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
"ఇంటిని విడిచివెళ్లాలని నేను తీసుకున్న నిర్ణయంతో కుటుంబ సభ్యులందరూ కోపంగా ఉన్నారు. అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు. యూపీఎస్సీ అధికారి కావడం సంతోషంగా ఉంది. కుటుంబం పట్ల నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తాను. అమ్మాయిలను చదువుకోనీయకుండా పెండ్లి పేరుతో ఒత్తిళ్లు మానుకోవాలి. వారి దారి వారు ఎంచుకునే స్వేచ్ఛను వారికిచ్చినప్పుడే భవిష్యత్ బంగారమయంతా తయారవుతుందని నమ్ముతాను" అని చెప్తున్నారు సంజు రాణి వర్మ. తనలాగే అందరూ ఉన్నత విద్య చదువుకుని కలలు నిజం చేసుకోవాలని యువతకు సంజూ రాణి సందేశమిస్తున్నది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Inspiration"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0