Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs: 1,11,093 vacancies in the Central Armed Forces ... Government announced

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 1,11,093 ఖాళీలు... ప్రకటించిన ప్రభుత్వం
Jobs: 1,11,093 vacancies in the Central Armed Forces ... Government announced

Central Govt Jobs 2020 నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. కేంద్ర సాయుధ బలగాల్లో 1,11,093 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు 

  • 1. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ లాంటి కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు.
  • 2. రిటైర్మెంట్, రాజీనామాలు, ఉద్యోగుల మరణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నియామక ప్రక్రియ ఎప్పట్లాగే కొనసాగుతోందని ఆయన తెలిపారు. 
  • 3. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు సమర్పించిన లెక్కల ప్రకారం కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 1,11,093 ఖాళీలు ఉన్నాయి. 
  • 4. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF లో ఎక్కువగా 28,926 ఖాళీలు ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్-CRPF లో 26,506 ఖాళీలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF లో 23906 ఖాళీలు, సశస్త్ర సీమా బల్-SSB లో 18,643 ఖాళీలు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్- ITBP లో 5,784 ఖాళీలు, అస్సాం రైఫిల్స్‌లో 7,328 ఖాళీలు ఉన్నాయి. 
  • 5. కేంద్ర సాయుధ బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్‌లో రిటైర్మెంట్, రాజీనామా, మరణాలు, కొత్త పోస్టుల సృష్టి, కేడర్ రివ్యూ కారణంగా ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. వీటిలో కానిస్టేబుల్ గ్రేడ్ పోస్టులే ఎక్కువ. 
  • 6. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్, డిప్యుటేషన్ లాంటి మార్గాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తామని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
  • 7. మొత్తం పోస్టుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC 60,210 కానిస్టేబుల్, 2,534 ఎస్సై పోస్టుల్ని, 330 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs: 1,11,093 vacancies in the Central Armed Forces ... Government announced"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0