Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Many schemes in Postoffice National Savings Certificate Scheme (NSC) Details

పోస్టాఫీలో పలు స్కీమ్స్ ... వీటితో అదిరే లాభం.

రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, అలాగే మంచి రాబడి పొందాలని భావించే వారు పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. పోస్టాఫీస్ స్కీమ్స్‌లో డబ్బులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. అందువల్ల మీ డబ్బుకు వచ్చే ప్రమాదమేమీ ఉండదు. బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై తక్కువ వడ్డీ వస్తోంది. అలాగే రూ.5 లక్షల వరకే మీ డబ్బుకు హామీ ఉంటుంది. పోస్టాఫీస్‌లోని స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (NSC) కూడా ఒకటి. ఈ పథకంలో చేరిన వారు ప్రతి నెలా చిన్న మొత్తంలోనే డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. లేదంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టొచ్చు. పోస్టాఫీస్ ఎన్ఎస్‌సీ స్కీమ్‌లో చేరడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే మీరు ఐదేళ్ల వరకు పెట్టిన డబ్బులను వెనక్కి తీసుకోలేరు. అయితే ఏడాది తర్వాత పాక్షికంగా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కీమ్‌లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరిన వారికి 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. రూ.100, రూ.500, రూ.1000, రూ.5,000, రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు పైన పేర్కొన్న మొత్తంలో ఎంత డబ్బైనా ఇచ్చి ఎన్ఎస్‌సీ సర్టిఫికెట్లను ఎన్నైనా కొనొచ్చు.

ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. అప్పుడు మీకు ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. అంటే వడ్డీ రూపంలో మీకు రూ.6 లక్షలు వస్తున్నాయి. మీరు కావాలనుకుంటే ఐదేళ్ల మెచ్యూరిటీ కాలాన్ని మరింత కాలం పొడిగించుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Many schemes in Postoffice National Savings Certificate Scheme (NSC) Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0