Loans less than 7% for homes
అందిస్తున్న బ్యాంకులివే ..
కరోనా మహా విపత్తే. అయితే, సంక్షోభం నుంచి కొత్త అవకాశాలూ పుట్టుకొస్తాయి. స్థిరాస్తి కొనుగోలే ఇందుకు మంచి ఉదాహరణ. ప్రస్తుతం డిమాండ్ లేక దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు భారీగా తగ్గాయి. ఇందుకు తోడు, బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే గృహ రుణాలిస్తున్నాయి. కరోనా కాలంలోనూ స్థిరంగా ఆదాయం ఆర్జిస్తున్న వారికిదే మంచి అవకాశం. చవకగా ఇళ్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
గత ఏడాది నుంచే కీలక వడ్డీ (రెపో) రేట్లను తగ్గించుకుంటూ వస్తోన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ).. కరోనా సంక్షోభ సమయంలో రెండు విడతల్లో ఏకం గా 1.15 శాతం తగ్గించింది. దాంతో బ్యాం కులు సైతం రెపో అనుసంధానిత రుణాలపై వడ్డీని గణనీయంగా త గ్గించాయి.
ప్రస్తు తం కొన్ని బ్యాంకులైతే 7 శాతం లోపు వార్షిక వడ్డీకే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మెరుగైన ఆదాయం, 750 -800 క్రెడిట్ స్కోర్ కలిగినవారు గృహ రుణం పొందేందుకు ఇది మంచి తరుణమని విశ్లేషకులంటున్నారు.
షరతులు వర్తిస్తాయ్..
రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)లో రెపో రేటు (ప్రస్తుతం 4 శాతం)తో పాటు బ్యాంక్ మార్జిన్, రుణగ్రహీత రిస్క్ రేటు మిళితమై ఉంటాయి. అద్భుతమైన క్రెడిట్ రేటిం గ్, మెరుగైన ఆర్థిక సామర్థ్యం కలిగిన వారికి మాత్రమే ఈ చవక వడ్డీ రేట్లకు రుణం లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, మీకు రుణం ఇవ్వడంలో రిస్క్ ఎక్కువని బ్యాంక్ భావించినా వడ్డీ రేటు పెరుగుతుంది.
అంతేకాదు, రుణం తీసుకున్నాక ఏదేని సమయంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గిన పక్షంలో మళ్లీ మెరుగుపర్చుకునే వరకు చెల్లించాల్సిన ఈఎంఐ పెరుగుతుంది. భవిష్యత్‌లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచుకుంటూ పోయినా మీపై వడ్డీ భారం పెరుగుతుంది.
0 Response to "Loans less than 7% for homes"
Post a Comment