Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Motor Act Supereme Court Guidance: Are you taking traffic rules lightly? Riding a bike without a helmet.? However, our purse is empty.

ఏపీ వాహనదారులకు అలెర్ట్ .. లైట్ తీసుకుంటే ఇక అంతే !
New Motor Act Supereme Court Guidance: Are you taking traffic rules lightly? Riding a bike without a helmet.? However, our purse is empty.

New Motor Act Supereme Court Guidance: ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే మన పర్స్ ఖాళీ కావడం ఖాయం. 
ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా అనర్హత వేటు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంలో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక ఈ రూల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

గతేడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చట్టంలో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది.

అయితే మిగిలిన 20 సెక్షన్లలో కూడా జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల వాటిపై కూడా వెసులుబాటు కల్పించాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీనితో కేంద్రం సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వారు తప్పనిసరిగా సవరించిన చట్టాన్ని అమలు చేయాలని.. ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

ఇక ఆ 20 సెక్షన్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని.. ఎలాంటి సడలింపులు ఉండబోవని కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. దీనితో తాజాగా సవరణలకు తగ్గట్టుగా ఏపీలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవాణాశాఖ పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపగా.. సీఎం ఆమోదముద్ర పడిన వెంటనే అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసి సవరణ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. సో వాహనదారులు బీ కేర్‌ఫుల్..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Motor Act Supereme Court Guidance: Are you taking traffic rules lightly? Riding a bike without a helmet.? However, our purse is empty."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0