Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BASARA IIIT B tech: Degree in Basra IIIT for those who pass the test ... Apply Like

BASARA IIIT B tech : టెస్త్ పాసైనవారికి బాసర ఐఐఐటీలో డిగ్రీ ... అప్లై చేయండి ఇలా
BASARA IIIT B tech: Degree in Basra IIIT for those who pass the test ... Apply Like

BASARA IIIT Integrated B Tech Admission 2020-21  బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనుకునేవారికి శుభవార్త . అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది .ఎలా అప్లై చేయాలో  వివరణ  
10వ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-RGUKT అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. బాసర ఐఐఐటీగా పేరొందిన ఈ కాలేజీలో సీటు కోసం పోటీ ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు వివరాలు చూస్తే ప్రీ-యూనివర్సిటీ కోర్స్ రెండేళ్లు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్‌తో రెండేళ్ల ఎంపీసీ కోర్సు ఇది. ఆ తర్వాత నాలుగేళ్లు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటల్లార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చేయొచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో పాటు గల్ఫ్ దేశాలు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. 85 శాతం సీట్లు స్థానికులకు అంటే తెలంగాణవాసులకు, 15 శాతం సీట్లు ఇతర ప్రాంతాల వారికి కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 3న ముగుస్తుంది. దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌‌సీసీ, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో 2020 అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్థులు టీఎస్ఆన్‌లైన్ సర్వీసెస్‌లో ఫీజు చెల్లించిన తర్వాత https://admissions.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. మరిన్ని వివరాలను https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభం- 16.09.2020
దరఖాస్తుకు చివరి తేదీ- 03.10.2020
స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 06.10.2020
విద్యార్హతలు- 10వ తరగతిలో వచ్చిన జీపీఏ ద్వారా ఎంపిక చేస్తారు.
వయస్సు- 2020 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ల లోపు
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.150.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Convener,
Rajiv Gandhi University of Knowledge Technologies,
Basar, Nirmal District,
Telangana State-504107.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BASARA IIIT B tech: Degree in Basra IIIT for those who pass the test ... Apply Like"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0