Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Parents to schools in AP ... hardships for students ... everything is written.

ఏపీలో స్కూళ్లకు తల్లిదండ్రులు... విద్యార్థుల కోసం అష్టకష్టాలు... అంతా లిఖితపూర్వకం.


  • AP Education: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల చదువుల విషయంలో... పక్కా ఆధారాలతో అడుగులు వేస్తోంది. రేపు ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో నెలల తరబడి మూసేసిన స్కూళ్లను సెప్టెంబర్ 21 మళ్లీ తెరిచారు. 9 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులను స్కూళ్లకు రమ్మని ఆర్డరేసింది ఏపీ విద్యా శాఖ.
  • కరోనా ఉంది కాబట్టి... విద్యార్థులను స్కూళ్లకు పంపాలా వద్దా అనే దానిపై ఫైనల్ నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేసింది ప్రభుత్వం.
  • విద్యార్థులు స్కూళ్లకు వస్తే... వాళ్లకు కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెబుతూ... ముందుగానే విద్యా శాఖ... స్కూళ్ల గదులను పూర్తిగా శానిటైజ్ చేయించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్య బోధన జరిగేలా చర్యలు చేపట్టింది.
  • ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లకు పంపాలని డిసైడవుతున్నారు. ఐతే.. ఇక్కడే ఓ లిటిగేషన్ ఉంది.
  • స్కూళ్లకు వచ్చే పిల్లల తల్లితండ్రుల దగ్గర అనుమతి పత్రం తీసుకుంటున్నారు అధికారులు. ఇదేంటంటే... "మా పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు. మా ఇష్ట ప్రకారమే స్కూళ్లకు పంపుతున్నాం" అని పేరెంట్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • అంతే కాదు... పిల్లల్ని స్కూళ్లకు పంపేటప్పుడు... వాళ్లకు కరోనా సోకకుండా... నోటికి మాస్కులు, చేతులకు శానిటైజర్ రాసి, సేఫ్ డిస్టాన్స్ పాటించేలా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రిపేర్ చెయ్యాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తామనేందుకే ఆ డిక్లరేషన్.
  • స్కూళ్లకు 9వ తరగతి నుంచి ఇంటర్ పిల్లల్నే అనుమతిస్తున్నారు కాబట్టి... ఆ పిల్లలందరికీ... కరోనాపై ఆల్రైపీ అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్లు సేఫ డిస్టాన్స్ తప్పక పాటిస్తారు. అందువల్ల కరోనా సమస్య తక్కువగానే ఉంటుంది.
  • అయినప్పటికీ... రేపు ఏ పిల్లలకైనా కరోనా సోకితే... ప్రభుత్వంపై తల్లిదండ్రులు ఆరోపణలు చేయకుండా ఉండేందుకే విద్యా శాఖ... పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటోంది.
  • తొలిరోజు అంటే సోమవారం... స్కూళ్లు అంతంతమాత్రంగానే తెరచుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల విధులలో ఉన్నవారు తప్ప మిగిలిన ఉపాధ్యాయులు 9, 10 తరగతి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హాజరయ్యారు.
  • ఆన్లైన్ క్లాస్‌లలో సందేహాలను తీర్చుకోవడానికే స్కూళ్లు తెరిచారు అనే అపోహతో... చాలా మంది 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు రాలేదు.
  • అన్ని స్కూళ్లలో సేఫ్ డిస్టాన్స్ విధానాలు పాటిస్తున్నారు. శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు.
  • మంగళవారం నుంచి స్కూళ్లకు విద్యా శాఖ ఆదేశాలతో 50 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే హాజరవుతున్నారు.
  • ఇప్పటికీ తల్లిదండ్రులకు పిల్లల్ని స్కూళ్లకు పంపే ఆసక్తి కనిపించట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కరోనా సోకుతుందేమో అనే భయం వెంటాడుతోంది. మంగళవారం డిక్లరేషన్ ఇచ్చేందుకు తల్లిదండ్రులు స్కూళ్లకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
  • ఇలా కరోనా కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, అధికారులు, ప్రభుత్వం... అందరూ ఇబ్బంది పడుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Parents to schools in AP ... hardships for students ... everything is written."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0