Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Safe from Moscow Better Corona than Vaccine: US CDC Director

వ్యాక్సిన్ కంటే మాస్కే బెటర్ కరోనా నుంచి సేఫ్: US సీడీసీ డైరెక్టర్
Safe from Moscow Better Corona than Vaccine: US CDC Director

మాస్క్‌ను తప్పనిసరిగా ధరించడం వల్ల కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కోవిడ్‌తో చిగురుటాకులా వణికిపోయిన స్పెయిన్‌లో మాస్క్ తప్పనిసరి చేసిన తర్వాత వైరస్ తీవ్రత తగ్గింది.

ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సమర్ధవంతమైన టీకా అందుబాటులోకి వచ్చేవరకూ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించి, భౌతికదూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ కంటే మాస్కే అత్యంత ఉత్తమైందని అమెరికా సెంటర్ ఫర్ డీసీజ్ కండ్రోల్ అండ్ ప్రెవెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్  వ్యాఖ్యానించారు. 

అమెరికా నిపుణుడు
సెనేట్ సబ్‌-కమిటీ సమావేశానికి హజరైన ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. కోవిడ్-19 నుంచి కాపాడటంలో వ్యాక్సిన్ కంటే మాస్క్‌ మరింత ప్రభావశీలమైందని పేర్కొన్నారు. ‘మన వద్ద ఉన్న శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఇదే చెబుతున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడే అత్యంత ప్రభావవంతమైన సాధనం మాస్క్! ఆ మాటకొస్తే.. టీకా కన్నా కూడా మాస్కే మనల్ని గ్యారెంటీగా కరోనా నుంచి కాపాడుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. 

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని రెడ్ ఫీల్డ్ సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ వినియోగిస్తే కరోనా మహమ్మారిని తొందరగా అదుపులోకి తీసుకురావచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వ్యాధినిరోధకత 70 శాతం వరకు వెళ్లవచ్చు.. ఒకవేళ రోగనిరోధక శక్తి ప్రతిస్పందించకపోతే టీకా రక్షించలేదు.. ఈ పని ఫేస్ మాస్క్ చేస్తుంది’అని అన్నారు. 

కాబట్టి అమెరికా పౌరులు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను.. ముఖ్యంగా 18- 25 ఏళ్ల యువకుల ద్వారా అమెరికాలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నాయని అన్నారు. నవంబరు లేదా డిసెంబరు మధ్య టీకా వచ్చినా సరఫరా స్వల్పంగా ఉంటుందని, ప్రాధాన్యతను బట్టి అందజేయనున్నట్టు రెడ్‌ఫీల్డ్ పేర్కొన్నారు.

కరోనా టీకా ఈ ఏడాది చివరికి గానీ లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలోగానీ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి ప్రజల్ని టీకా ఎంతమేరకు రక్షింస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం నిపుణుల వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు.

తొలి దశలో లభ్యమయ్యే టీకాలు ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో రక్షణ కల్పించలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 75 శాతం మందికి రక్షణ లభిస్తే మనల్ని మనం అదృష్టవంతులుగా భావించాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. టీకా కనీసం 50 శాతం రక్షణ కల్పిస్తుందని రుజువైతే విధానపరమైన అనుమతులు జారీ చేస్తామని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాస్కుల ప్రాముఖ్యాన్ని విశదీకరిరంచారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Safe from Moscow Better Corona than Vaccine: US CDC Director"

Post a Comment